'బాహుబలి: ద బిగినింగ్' సినిమా రన్ టైమ్ ఎంత? 2.39 గంటలు! బాహుబలి రెండో భాగం రన్ టైమ్... తొలి భాగం కంటే ఓ ఎనిమిది నిమిషాలు ఎక్కువ అంతే! 'బాహుబలి: ద క‌న్‌క్లూజ‌న్‌' 2.47 గంటల సినిమా. రాజమౌళి హిట్ సినిమాలు 'మగధీర', 'ఈగ' సినిమాల రన్ టైమ్ కూడా ఇంచుమించు అంతే! మూడు గంటలకు లోపే సినిమా చూపించారు. 'ఆర్ఆర్ఆర్'ను మాత్రం ప్రేక్షకులకు మూడు గంటల కంటే ఎక్కువ సేపు చూపించేలా తీశారట. 


'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' రన్ టైమ్ మూడు గంటల కంటే కొంచెం ఎక్కువే ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇద్దరి క్యారెక్టర్లకు ఎలివేషన్ సీన్లు, హీరోయిజమ్ చూపించే సీన్లు ఉన్నాయని టాక్. అజయ్ దేవగణ్ సీన్లు కొన్ని ఉన్నాయి. కథలో భాగంగా ఇవన్నీ ఉన్నాయని, వాటిని తొలగించడం కంటే ఉంచితే బాగుంటుందని రాజమౌళి అండ్ కో డిసైడ్ అయ్యారట. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిజం, ఎమోషనల్ పరంగా ప్రేక్షకులకు 'ఆర్ఆర్ఆర్' హై ఇస్తుందని ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌.


డిసెంబర్ తొలి వారంలో 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఒకటి కంటే ఎక్కువ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని తదితరులు నటించిన ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత. జనవరి 7న సినిమా విడుదల కానుంది. 'ఆర్ఆర్ఆర్' సోల్ సాంగ్ 'జనని' శుక్రవారం విడుదల కానున్న సంగతి తెలిసిందే.





Also Read: కొవిడ్‌లో చాలా గోతులు త‌వ్వుకున్నాం... మ‌ళ్లీ థియేట‌ర్ల‌కు రావాలి! - సుప్రియ
Also Read: ఆ హరిణి వేరు... ఈ హరిణి వేరు! హరిణి పేరుతో ముగ్గురు ఉండటంతో క‌న్‌ఫ్యూజ‌న్‌!
Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
Also Read: టాలీవుడ్ మీడియాకు 'జనని...' సాంగ్ చూపించిన రాజమౌళి... ఎలా ఉందంటే?
Also Read: శివ శంకర్ మాస్టర్‌కు సోనూసూద్ భరోసా.. నేను సాయం చేస్తా!
Also Read: సముద్రం అడుగున హోటల్ గదిలో పూజా హెగ్డే.. ఆ అందాలను చూస్తే మతి పోతుంది!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి