రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు సినిమా టికెట్లు అమ్మాలని, ఆన్‌లైన్ టికెట్లు ప్రభుత్వ పోర్టల్‌లో మాత్రమే కొనాలని, బెనిఫిట్ షోలకు అనుమతులు లేవని నిర్ణయిస్తూ... ఏపీ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఆ బిల్ ఆమోదం పొందింది. ప్రస్తుతం ప్రభుత్వం సూచించిన రేట్లకు సినిమా టికెట్లు అమ్మితే... థియేటర్ నిర్వహణ చార్జీలు కూడా రావనేది పరిశ్రమ వర్గాలు చెబుతున్న మాట. దీనివల్ల సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టాలు తప్పవని, బెనిఫిట్ షోలు లేకపోవడం వల్ల పెద్ద సినిమాలపై ప్రభావం పడుతుందనేది కొందరి మాట. అయితే... టికెట్ రేట్స్ మీద మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సిందిగా కోరారు. ఇదే విషయమై నాగార్జున మేనకోడలు, నిర్మాత సుప్రియ కూడా స్పందించారు.


ఏపీ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై సుప్రియను ప్రశ్నించగా... "గవర్నమెంట్ పాలసీ గవర్నమెంట్ పాలసీయే. మన సినిమా ఒక ఇండస్ట్రీ. అన్నీ మారుతూ ఉంటాయి. చేంజెస్ జరుగుతూ ఉంటాయి. మనం వాటితో పాటు వెళ్లాలి. ఇప్పుడు సినిమాపై ఎఫెక్ట్ ఆ? అని అంటున్నారు కానీ... మనకు తెలియకుండానే కొవిడ్‌లో చాలా గోతులు తవ్వుకున్నాం. మళ్లీ థియేటర్లకు రావాలి. ఎంత పెట్టి వస్తాం? అనేది పక్కన పెట్టండి. థియేటర్‌కు మాత్రం రావాలి. ప్రతి ఊరిలో థియేటర్ ఎందుకు కట్టుకున్నారు? వాళ్లకు ఓ చిన్న పౌరుషం! 'మాక్కూడా థియేటర్ ఉంది. శుక్రవారం వస్తే పదిమంది వచ్చి మమ్మల్ని టికెట్స్ అడుగుతారు. పెద్ద సినిమా పడుతుంది. దాన్ని కొంటాం' అని. అదొక కల్చర్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో... ఆన్ లైన్ బుకింగ్ కానివ్వండి, రేట్లు కానివ్వండి - గవర్నమెంట్ ను దాటి వెళ్లలేం. వాళ్లకు మన ఇండస్ట్రీ ఏంటనేది మనం చూపిస్తూ... వాళ్లను కూడా ఎడ్యుకేట్ చేస్తూ... 'మాకు ఇది అవసరం' అని వెళ్లాలి. ఇది లాంగ్ ప్రాసెస్. మారుతూ ఉంటుంది" అని చెప్పారు.


రాజ్ తరుణ్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'అనుభవించు రాజా' సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సినిమా విలేకరుల సమావేశంలో ఏపీలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుపై ప్రశ్నించగా... సుప్రియ సమాధానం ఇచ్చారు. 
Also Read: ఆ హరిణి వేరు... ఈ హరిణి వేరు! హరిణి పేరుతో ముగ్గురు ఉండటంతో క‌న్‌ఫ్యూజ‌న్‌!
Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
Also Read: టాలీవుడ్ మీడియాకు 'జనని...' సాంగ్ చూపించిన రాజమౌళి... ఎలా ఉందంటే?
Also Read: శివ శంకర్ మాస్టర్‌కు సోనూసూద్ భరోసా.. నేను సాయం చేస్తా!
Also Read: సముద్రం అడుగున హోటల్ గదిలో పూజా హెగ్డే.. ఆ అందాలను చూస్తే మతి పోతుంది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి