హీరోయిన్ కంగనా రనౌత్‌కు దిల్లీ అసెంబ్లీ సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 6 మధ్యాహ్నం 12:00 గంటలకు కంగానా తమ ముందు హాజరు కావాలని దిల్లీ అసెంబ్లీ శాంతిసామరస్య కమిటీ ఆదేశించింది. సిక్కు సమాజంపై ఇటీవల కంగానా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కమిటీ ఛైర్మన్‌గా ఆమ్‌ఆద్మీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా ఉన్నారు.
నూతన సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటన చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భారత్‌ను 'జిహాదిస్ట్ నేషన్' అని పిలిచారు. సిక్కులను 'ఖలిస్థానీలు'గా కంగనా పిలిచారు.
ఇటీవల కంగనా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ స్వాతంత్య్రంపై ఆమె చేసిన వ్యాఖ్యలను విపక్షాలు సహా అధికార భాజపాలోని కొందరు నేతలు ఖండించారు.
Also Read: NEET Counselling 2021 Postponed: నీట్ కౌన్సిలింగ్ వాయిదా.. 'ఈడబ్ల్యూఎస్'పై కేంద్రం పునరాలోచన!
Also Read: Toilet Paper: బాబూ చిట్టీ.. ఇదేం రాజీనామా లేఖ నాయనా.. రాసేందుకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా?
Also Read: INS Vela Pics: భారత అమ్ములపొదిలో ఐఎన్ఎస్ వేలా.. ఇది చాలా స్పెషల్ గురూ!
Also Read: Watch Video: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం