చిట్ ఫండ్ కంపెనీల మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కస్టమర్‌ల నుంచి ప్రతి నెల చిట్ డబ్బులు వసూలు చేసి గడువు ముగిశాక చేతులు ఎత్తేస్తున్నారు.. కొందరు కేటుగాళ్లు. కొన్ని చోట్ల తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని ప్రాధేయపడుతున్నా వినకుండా బెదిరింపులకు పాల్పడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండగా.. ఆప్పుడు విషయం వెలుగులోకి వస్తోంది. ఇలాంటి ఘటన తాజాగా హన్మకొండలో చోటుచేసుకుంది. 


Also Read: కాష్మోరా ప్రయోగిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. 'తులసీ దళం' కి మించి 'తులసి తీర్థం'.


హన్మకొండలో కొద్ది కాలంగా అచల చిట్ ఫండ్ అనే సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. చిట్ డబ్బులు మొత్తం కట్టించుకున్న అనంతరం అచల చిట్ ఫండ్ యాజమాన్యం కస్టమర్‌లకు ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హన్మకొండలోని నక్కల గుట్ట బ్రాంచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆడెపు అన్నపూర్ణ అనే మహిళ దాదాపు రూ.పది లక్షల చిట్ విభాగంలో మూడు చిట్‌లు వేసింది. చిట్‌ల కాల పరిమితి ముగిసిపోయిన తరువాత తన మూడు చిట్టీల డబ్బులు ఇవ్వమని ఆడెపు అన్నపూర్ణ ఆచల చిట్ ఫండ్ నక్కలగుట్ట బ్రాంచ్‌లో అడిగింది.


Also Read: సముద్రం అడుగున హోటల్ గదిలో పూజా హెగ్డే.. ఆ అందాలను చూస్తే మతి పోతుంది!


ఎన్నిసార్లు అడిగినా తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోగా చిట్ వేసిన ఆడెపు అన్నపూర్ణను, ఆచల చిట్ ఫండ్ యజమాని పంచగిరి సత్యనారాయణ బెదిరింపులకు పాల్పడ్డాడు. చిట్టీల గడువు ముగిసిపోయిన తర్వాత మూడు చిట్టీల డబ్బులు ఇవ్వకపోగా, చిట్టీలు వేసిన అన్నపూర్ణను భయబ్రాంతులకు గురిచేయడంపై బాధితురాలు అన్నపూర్ణ సుబేధారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తగిన సాక్ష్యాధారాలను చూపడంతో పోలీసులు విచారణ జరిపి, చిట్ ఫండ్ యజమాని పంచగిరి సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండు విధించడంతో, జైలుకు తరలించినట్లు సుబేధారి ఇన్‌స్పెక్టర్ అల్లే రాఘవేందర్ వెల్లడించారు.


Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం.. ఈ వీరాభిమాని ఏంచేశాడో తెలుసా? ఏకంగా గాల్లోనే కంగ్రాట్స్


Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి  
Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి