INS Vela Pics: భారత అమ్ములపొదిలో ఐఎన్ఎస్ వేలా.. ఇది చాలా స్పెషల్ గురూ!
భారత్ స్టెల్త్ స్కార్పీన్ శ్రేణి నాలుగో జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వేలా నావికాదళ విధుల్లోకి చేరింది.
నావికాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ వేలా జలాల్లోకి ప్రవేశించింది.
దేశీయంగా నిర్మించిన బ్యాటరీలను, ఆధునిక కమ్యూనికేషన్ల సూట్‌ను తొలిసారిగా ఐఎన్‌ఎస్ వేలాలో అమర్చారు. ఇది ఐఎన్ఎస్ వేలా పాత చిత్రం.
భారత్‌కు ఉన్న స్టెల్త్ స్కార్పీన్ శ్రేణి జలాంతర్గాముల్లో ఐఎన్‌ఎస్ వేలా నాలుగోది.
ఫ్రాన్స్ నావల్ గ్రూప్‌తో కలిసి ముంబయిలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఈ ఆధునికమైన జలాంతర్గామిని తయారుచేసింది.
సముద్ర యుద్ధరీతుల్లో ఐఎన్‌ఎస్ వేలా అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది.
ఆధునిక టార్పెడోలు, క్షిపణులు ప్రయోగించగల సామర్థ్యం ఈ జలాంతర్గామి సొంతం.
ప్రస్తుత సంక్లిష్ట భద్రతా పరిస్థితుల్లో ఐఎన్‌ఎస్ వేలా తన సామర్థ్యం, ఆయుధ సంపత్తితో భారత తీర ప్రాంతాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అడ్మిరల్ కరంబీర్ సింగ్ తెలిపారు.