In Pics: ఇందిరా పార్కు వద్ద రైతు సంఘాల మహాధర్నా.. హాజరైన రాకేశ్ టికాయత్
వ్యవసాయ చట్టాల రద్దును పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో రైతు సంఘాలు మహాధర్నా చేస్తున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇందిరా పార్క్ వద్ద జరిగిన ఈ ధర్నాలో బీకేయూ నేత రాకేశ్ టికాయత్ పాల్గొన్నారు.
సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రైతు ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నారు.
అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎంఎస్), సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్ద ఈ ధర్నా చేస్తున్నారు.
అన్ని రకాల వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల చట్టం ప్రవేశపెట్టి అమలు చేయాలని ఈ వేదిక ద్వారా కిసాన్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు ఏడాది పాటు రైతులు ఉద్యమం చేశారు.
ఉద్యమానికి తలొగ్గిన ప్రధాని నరేంద్ర మోదీ.. సాగు చట్టాలను రద్దు చేస్తామని ఇటీవల ప్రకటించారు.
శీతాకాల సమావేశాల్లో సాగు చట్టాల రద్దు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.
సాగు చట్టాల రద్దు నిర్ణయానికి నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.