నీట్ కౌన్సిలింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. నీట్ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల విషయంలో వార్షిక ఆదాయం రూ.8 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉన్న వారిని ఆర్థికంగా వెనకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) వారిగా పరిగణించడంపై పునరాలోచిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం గురువారం తెలిపింది. ఇందుకోసం నాలుగు వారాల సమయం కోరింది.
జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్తో కూడిన ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌పై కేంద్రం నిర్ణయం తీసుకునేవరకు కౌన్సిలింగ్ జరిగే అవకాశం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సుప్రీం ధర్మాసనానికి స్పష్టం చేశారు. నాలుగు వారాల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వాదనలు విన్న అనంతరం కేసు విచారణను జనవరి 6కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
నీట్ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రం, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించింది. అఖిల భారత కోటాలోకి వచ్చే సీట్లలో వెనుకబడిన తరగతులకు(ఓబీసీలు) 27 శాతం రిజర్వేషన్లు, ఆర్థికంగా వెనకబడిన తరగతులు(ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. జులై 29న కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది సుప్రీం కోర్టు.
Also Read: Toilet Paper: బాబూ చిట్టీ.. ఇదేం రాజీనామా లేఖ నాయనా.. రాసేందుకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా?
Also Read: INS Vela Pics: భారత అమ్ములపొదిలో ఐఎన్ఎస్ వేలా.. ఇది చాలా స్పెషల్ గురూ!
Also Read: Watch Video: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం