ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరించేలా పార్లమెంట్‌లో గళమెత్తాలని ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ పార్లమెంట్ భేటీలో నిర్ణయించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ తాడేపల్లిలోని సీఎం క్యాంపాఫీస్‌లో జరిగింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ దిశానిర్దేశం చేశారు. విభజన సమస్యలు సహా ఏపీకి సంబంధించి అనేకం పెండింగ్ ఉన్నాయని.. వాటన్నింటిపై కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించారు.
Also Read : శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ గా జకియా ఖానమ్ ఎన్నిక... సీఎం జగన్ ఏమన్నారంటే...?
పోలవరం నిర్మాణ ఖర్చు రూ. 55 వేల కోట్లు ఆమోదం పొందేలా కృషి చేయాలని పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి జగన్ సూచించారు. జాతీయ ప్రాజెక్టులో సాగునీరు, విద్యుత్ కలిపి చూడాలని కొరతామని, జోనల్ కౌన్సిల్‌లో ముఖ్యమంత్రి లేవనెత్తిన 6 అంశాలు పార్లమెంట్‌లో గళమెత్తుతామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆహార భద్రత చట్టం ద్వారా ఏపీకి అన్యాయం జరుగుతోందని, దాన్ని ఉభయసభల్లో లేవనెత్తుతామన్నారు.
Also Read: సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !
బీసీ జనగణన అసెంబ్లీలో తీర్మానం చేశామని, దాన్ని కూడా కేంద్రంతో ప్రస్తావిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని, దాన్ని లాభాల్లోకి తెచ్చేందుకు గట్టిగా కృషి చేస్తామని అన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం రూ.30 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని.. అవి ఇవ్వాలని ఒత్తిడి తెస్తామన్నారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నామని .. తమపోరాటం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఎంపీ తేల్చి చెప్పారు.
Also Read: జగన్‌పై పొగడ్తల విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ తగ్గలే ! మంత్రి పదవుల కోసమేనా ?
తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. వరద బాధితులకు తాత్కాలికంగా రూ.1000 కోట్లు కావాలని సీఎం జగన్ కోరారని పార్లమెంటులో ఈ అంశంపై మాట్లాడతామని తెలిపారు. రాజకీయంగా తాము ఏ కూటమిలో లేమని, తమది ప్రజల కూటమి అని సీఎం జగన్ ఎంపీలకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రతిష్టను నిలబెట్టేలా పార్లమెంటులో వ్యవహరించాలని ఎంపీలకు స్పష్టంగా చెప్పారు.
Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !