శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ గా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఎమ్మెల్సీ జకియా ఖానమ్ డిప్యూటీ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. సీఎం జగన్ ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఆమె సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. జకియా ఖానమ్ మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో పదవి ఇచ్చినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని అన్నారు. మహిళల సంక్షేమ కోసం సీఎం జగన్ అనేక పథకాలు తీసుకువచ్చారని ఆమె తెలిపారు. దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఓ సాధారణ గృహిణికి అత్యంత సముచిత స్థానాన్ని కల్పించినందుకు మైనార్టీలందరూ హర్షిస్తారని జకియా పేర్కొన్నారు. మైనార్టీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానన్నారు. కడప జిల్లా రాయచోటిలో మైనార్టీలకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ తన మాట నిలబెట్టుకున్నారని జకియా ఖానమ్ అన్నారు.
Also Read: సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !
సీఎం జగన్ శుభాకాంక్షలు
'ఈ రోజు అధ్యక్షా అని సంబోధించే స్థానంలో అక్క జకియా ఖానమ్ కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక సాధారణ కుటుంబం నుంచి గృహిణిగా వచ్చి చట్టసభల్లో అడుగుపెట్టడమే కాకుండా డిప్యూటీ ఛైర్మన్‌గా ఈ రోజు ఆ స్థానంలో కూర్చున్నారు. నిజంగా మైనార్టీ అక్కచెల్లెమ్మలందరికీ ఇది ఒక సంకేతం, ఒక సందేశం. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి. ప్రభుత్వమన్నది తోడుగా ఉండాలన్న ప్రయత్నం ఈ రెండున్నర సంత్సరాలుగా జరుగుతుంది. అందులో భాగంగా దేవుడు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. మీకు మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను' అని సీఎం జగన్ డిప్యూటీ ఛైర్ పర్సన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: జగన్‌పై పొగడ్తల విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ తగ్గలే ! మంత్రి పదవుల కోసమేనా ?
గురువారం నామినేషన్
ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి గురువారం నామినేషన్ దాఖలు అయింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ నామినేషన్ వేశారు. దీంతో తొలిసారి మైనారిటీ మహిళకు డిప్యూటీ ఛైర్మన్ పదవి అవకాశం దక్కింది. శుక్రవారం ఈ ఎన్నిక జరిగింది.
Also Read: ఒక్క రోజు కాదు 26 వరకు ఏపీ అసెంబ్లీ .. బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం !
Also Read: ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !
Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి