ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను 26వ తేదీ వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ భేటీలో నిర్ణయించారు. ఇంతకు ముందు ఒక్క రోజు మాత్రమే సమావేశం నిర్వహించాలనుకున్నారు. ఈ ఉదయం వరకూ అదే అనుకున్నారు. అయితే స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఆమోదం పొందాల్సిన బిల్లులు ఎక్కువగా ఉన్నందున ఒక్క రోజులో సమావేశం ముగించడం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో 26వ తేదీ వరకూ నిర్వహించాలని నిర్ణయించారు. 


Also Read : వైఎస్‌ఆర్‌సీపీ పంతం - టీడీపీ నిర్లక్ష్యం ! కుప్పంలో కదిలిన చంద్రబాబు పునాదులు !


తొలి రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే పెట్రోల్, డీజిల్ ధరలపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత బద్వేలు ఉపఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే సుధ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించి వాయిదా వేశారు.. బీఏసీ సమావేశాన్ని నిర్వహించారు. బీఏసీ సమావేశానికి టీడీపీ తరపున అచ్చెన్నాయుడు, అధికార పార్టీ తరపున సీఎం జగన్, అనిల్, కన్నబాబు, బుగ్గన హాజరయ్యారు. ఒక్క రోజు మాత్రమే సభ నిర్వహించడం సరి కాదని... పదిహేను రోజులు నిర్వహించాలని అచ్చెన్నాయుడు కోరారు. 26వతేదీ వరకూ నిర్వహించేందుకు సీఎం జగన్ అంగీకరించారు. 


Also Read : మినీ లోకల్ వార్‌లో వైఎస్ఆర్‌సీపీ హవా .. ఉనికి చాటుకున్న టీడీపీ ! పూర్తి ఫలితాలు ఇవే !


బీఏసీలో ఎన్నికల ఫలితాలపైనా చర్చ జరిగింది. కుప్పం, నెల్లూరు ఫలితాలను సీఎం జగన్ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అయితే బీఏసీలో ఎన్నికల ప్రస్తావన ఎందుకని గెలుపోటములు రాజకీయాలలో సర్వసాధారణమని..  అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ అంశాల్లో ప్రభుత్వం 14 ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. వాటిని బిల్లుగా ఆమోదింప చేసుకోవాల్సి ఉంది. ఈ  ఈ సమావేశాల్లో 14 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందు ఉంచి ఆమోదం పొందనుంది. మహిళా సాధికారతపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరుగనుంది.


Also Read : అసెంబ్లీ రద్దు చేసి మళ్లీ గెలిస్తే టీడీపీ రద్దు ..వైఎస్ఆర్సీపీకి టీడీపీ సవాల్ !


మరో వైపు ఏపీ శాసన మండలి బీఏసీలో గందరగోళం పరిస్థితి నెలకొంది. శాసనసభ ఎన్ని రోజులు జరిగితే శాసనమండలి కూడా అన్ని రోజులు జరగడం సంప్రదాయం. అయితే సమాచారం లేకపోవడంతో శాసన మండలి ఒక్కరోజు మాత్రమే అని మండలి బీఏసీలో ప్రకటించారు. ఇందుకు నిరసనగా మండలి బీఏసీ నుంచి కౌన్సిల్ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వాక్ ఔట్ చేశారు. అసెంబ్లీ శాససభ సమావేశాల పొడిగింపుపై తమకు సమాచారం లేదంటూ... రెండోసారి మండలి బీఏసీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 


Also Read : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? ఏపీ బీజేపీ నేతలకు చివరి చాన్స్ !?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి