ఆంధ్రప్రదేశ్‌లో అందరి చూపు కుప్పం వైపే ఉంది. మిగతా వాటి సంగతేమో కానీ అందరి దృష్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో తెలుగుదేశం గెలుస్తుందా లేదా అన్న ఆసక్తి రాష్ట్రం మొత్తం ఏర్పడింది.  నియోజకవర్గంపై పడింది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం కోటకు బీటలు కొట్టేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. గతంలో పంచాయతీ, పరిషత్ ఎన్నికల ఫలితాలు అలాగే వచ్చాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించారు. చంద్రబాబు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కోట కుప్పకూలింది. దీనికి కారణం ఏమిటి ? 




Also Read : మినీ లోకల్ వార్‌లో వైఎస్ఆర్‌సీపీ హవా .. ఉనికి చాటుకున్న టీడీపీ ! పూర్తి ఫలితాలు ఇవే !


కుప్పం నగర పంచాయతీలో టీడీపీ ఓటమి !


కుప్పం నగర పంచాయతీలో 25 వార్డులు ఉన్నాయి. ఇందులో ఒకటి ఏకగ్రీవం అయింది. మిగతా 24 స్థానాలకు ఎన్నికలకు జరిగితే టీడీపీ అభ్యర్థులు ఆరు చోట్ల మాత్రమే విజయం సాధించారు. మాజీ సర్పంచ్ త్రిలోక్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయారు. చాలా చోట్ల వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులకు భారీ మెజార్టీ వచ్చింది.  డబ్బు, మద్యం, దొంగ ఓటర్లు ఇలా ఎన్ని కారణాలు చెప్పినా ఓటమి ఓటమే.


Also Read : అసెంబ్లీ రద్దు చేసి మళ్లీ గెలిస్తే టీడీపీ రద్దు ..వైఎస్ఆర్సీపీకి టీడీపీ సవాల్ !


నాలుగు జడ్పీటీసీ స్థానాల్లోనూ ఓటమి !


నగర పంచాయతీలోనే కాదు గతంలో జరిగిన పరిషత్ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. నాలుగు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో సైలెంటయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీలు సాధించారు. మొత్తం 66 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 65 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో మూడు స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. నిజానికి టీడీపీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తర్వాత అనేక మంది అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధికార బలం ముందు పోరాడటం కష్టమని పార్టీ మారిపోయారు. అతి కొద్ది మంది మాత్రమే వ్యక్తిగతంగా పోరాడారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా అక్కడ్నుంచి పోటీ చేయడం ప్రారంభించిన తర్వాత కుప్పం మండలంలో టీడీపీ ఎప్పుడూ ఓడిపోలేదు. ఈ సారి మాత్రంపరాజయం మూటగట్టుకుంది.


Also Read : వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ అదుపులో శివశంకర్ రెడ్డి
  
పోటీ చేసిన పంచాయతీల్లోనూ గడ్డు పరిస్థితే..! 


పంచాయతీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని ఎన్నికలు జరిగిన 89 గ్రామాల్లో కేవలం 14చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. 74 గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. అంటే మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హవా కనిపించింది.


Also Read : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? ఏపీ బీజేపీ నేతలకు చివరి చాన్స్ !?


పెద్దిరెడ్డి పంతం - పట్టించుకోని టీడీపీ హైకమాండ్ 


కుప్పంలో పట్టు సాధించాలని మంత్రి పెద్దిరెడ్డి పంతం పెట్టుకున్నారు. ఆయన స్థానిక ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన ప్రారంభించినప్పటి నుండి కుప్పంపైనే దృష్టి పెట్టారు. అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ తో పాటు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అన్న రీతిలో ఆయన టీడీపీ క్యాడర్‌ను కంట్రోల్ చేశారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను సమన్వయం చేసే బృందం కూడా కనిపించలేదు.  సీనియర్‌ నాయకులందరూ ఏవేవో కారణాలు చూపించి పక్కకు తప్పుకోవడంతో చాలాచోట్ల ఆర్థికంగా బలహీనులు, గ్రామాల్లో పెద్దగా బలంలేని వారు నిలబడ్డారు. ఫలితంగా పరాజయం పాలయ్యారు.






Also Read : నెల్లూరులో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్..కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీడీపీ !


చంద్రబాబుకు ప్రమాద ఘంటికలే !  


దశాబ్దాలుగా చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలోనూ వైఎస్సార్‌సీపీ క్రమంగా మెరుగుపడుతోందన్నది నిజం. 2014లో 50 వేలు ఉన్న చంద్రబాబు మెజారిటీని 2019లో 27 వేలకు తగ్గింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్‌ ఎన్నికల్లో దాదాపు 43 వేల ఓట్లు రాగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 62,957 ఓట్లు వచ్చాయి. అంటే ఓటింగ్ తగ్గినా ఇరవై వేల ఓట్లు పెరిగాయి. నగర  పంచాయతీ ఎన్నికల్లో మరింతగా ఓట్లు పెరిగాయి. మొత్తంగా చూస్తే తమకు అరవై వేల మెజార్టీ వచ్చిందని వైఎస్ఆర్‌సీపీ  వర్గాలు ప్రకటిస్తున్నాయి. చంద్రబాబుకు గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువే వచ్చాయని చెబుతున్నారు. ఎలా చూసినా చంద్రబాబుకు ప్రమాద ఘంటికలేనని టీడీపీ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. 


Also Read : కుప్పం ఓటమిని అంగీకరించి రాజకీయాల నుంచి వైదొలగాలి .. చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సూచన!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి