ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వంతు ప్రయత్నాలు గట్టిగానే చేశారు. మామూలుగా అయితే విపక్షాలను ఘాటుగా విమర్శించి సీఎం దృష్టిలో పడాలని ఎక్కువ మంది అనుకునేవారు. అయితే ఈ సారి ప్రతిపక్షం సభలో లేకపోవడంతో విపక్షాలపై విమర్శల కన్నా ఎక్కువగా సీఎం జగన్‌ను పొగడటానికే ప్రాధాన్యం ఇచ్చారు. మహిళా ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా పేపర్లపై రాసుకు వచ్చి మరీ కవితల రూపంలో సీఎం జగన్‌ను పొగిడేశారు. ఎక్కువ మంది సీఎం జగన్ సభలో ఉన్నప్పుడే ఈ పొగడ్తలు కురించారు. ఎందుకంటే ఆయన దృష్టిలో పడాలనేది ప్రతి ఒక్కరి ప్రయత్నం.
Also Read : సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !
విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈ పొగడ్తల విషయంలో ఈ సారి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఆయన ఇటీవల తన కుమార్తె పెళ్లి పాట పాడి సింగర్ అనిపించారు. ఇప్పుడు అసెంబ్లీలో జగన్‌పై ఓ కవిత రాసి . దాన్ని రాగయుక్తంగా పాడారు. ఆయన ఆలా పొగుడుతున్న సీఎం జగన్ నవ్వుతూ ఉండిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !
కొంత మంది జగన్‌ను, వైఎస్‌ను పొగిడే క్రమంలో కొన్ని అనూహ్యమైన ప్రకటనలు చేయడంతో సో,ల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. మాజీ మంత్రి పార్థసారధి చంద్రబాబు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ బిల్డింగ్ మాత్రమే కట్టించారని..కానీ వైఎస్ రాజశేకర్ రెడ్డి ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వడం వల్లనే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఐటీ కంపెనీలు రావడానికి సంబంధమేమిటా అని సోషల్ మీడియా తెగ చర్చించింది. శాసనమండలిలోనూ జగన్‌పై పొగడ్తలు కురిపించేందుకు పలువురు పోటీ పడ్డారు. అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జ్ గా.. ఎమ్మెల్సీగా ఉన్న మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ కూడా పొగడ్తల విషయంలో పోటీ పడ్డారు. ఏపీలో సీఎం జగన్ పాతికేళ్లు సీఎంగా ఉంటారని.. ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రి అవుతారని కాస్త ఇబ్బందిగా అయినా పొగిడారు.
Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా జగన్‌ను వరుసగా కాస్త ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ పొగడటానికి ప్రధాన కారణం త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండటమేనని భావిస్తున్నారు. వంద శాతం మంత్రుల్ని జగన్ మార్చేయబోతున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గట్టిగా నమ్మతున్నారు. కొంత మంది మంత్రులు తమ పదవుల్ని కాపాడుకునేందుకు... ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో బెర్త్ పొందేందుకు తమ వంతు ప్రయత్నాల కోసం ఇలా అసెంబ్లీలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నట్లుగా భావిస్తున్నారు.
Also Read : నిమిషాల్లో విరుచుకుపడిన ప్రళయం ! పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల విలయం ఎలా జరిగిందంటే ?