ఏపీ ప్రభుత్వం ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తూ అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకురావ‌డంతో పాటు టికెట్ రేట్స్ తగ్గించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై పరిశ్రమ నుంచి చిరంజీవి సహా కొంత మంది హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధంగా టికెట్ ధరలు నిర్ణయిస్తే బావుంటుందని, ఆ విషయమై పునరాలోచించాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. అలాగే, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం సోషల్ మీడియా వేదికగా టికెట్ రేట్స్ గురించి స్పందించినట్టు వార్తలు వచ్చాయి.
"త్రివిక్రమ్ గారికి ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. ఆయన పేరు లేదా ఫొటో ఉపయోగించి వివిధ ఖాతాల్లో చేసిన కామెంట్స్‌ను నమ్మవద్దు. త్రివిక్రమ్ గారి నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఏదైనా సరే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నుంచి మాత్రమే వస్తుంది" అని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ట్వీట్ చేశాయి. త్రివిక్రమ్ అంటే ఎంతో మందికి అభిమానం ఉంది. ఆయన పేరుతో ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో కొంత మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. త్రివిక్రమ్ రాసిన డైలాగులు, సినిమా ఈవెంట్స్‌లో ఆయన చేసిన మంచి మాటలను పోస్ట్ చేస్తుంటారు. ఏపీలో కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన రేట్స్ గురించి ఎవరో త్రివిక్రమ్ పేరు మీద ఓపెన్ చేసిన ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేసినట్టు ఉన్నారు. అది త్రివిక్రమ్ అకౌంట్ అనుకుని మంత్రి భావించినట్టు ఉన్నారు. 
Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
'ప్రతి సినిమాకూ ఒకటే టికెట్ రేట్ అన్నట్టుగా... ప్రతి పాఠశాలలో ఒకటే రేటు, ప్రతి ఆస్పత్రిలో ఒకటే బిల్లు ఎందుకు ప్రవేశపెట్టరు? పేదలకు విద్య, వైద్యం కంటే సినిమా ఎక్కువా?' అని త్రివిక్రమ్ ట్వీట్ చేసినట్టు శుక్రవారం అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. త్రివిక్రమ్ ట్వీట్‌ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళతానని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ ట్వీట్‌కు, ట్విట్ట‌ర్ ఖాతాకు, దర్శకులు త్రివిక్ర‌మ్‌కు ఎటువంటి సంబంధం లేదనే ప్రకటన వచ్చింది. 





Also Read: అక్కినేని కాంపౌండ్‌లో సమంత... పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి!
Also Read: కంగనా రనౌత్ పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు... వివాదాస్పద వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని ఆర్డర్
Also Read: 456 మందితో రియల్ ‘స్క్విడ్ గేమ్’.. విజేతకు రూ.3.41 కోట్లు, ఓడినవాళ్లను ఏం చేశారంటే..
Also Read: ఒక్క రోజు ఆలస్యంగా 'మరక్కార్‌'... గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్!
Also Read: హీరోయిన్‌కు ఎదురైన సంఘటనల వల్లే 'అఖండ' ఎంట్రీ... బాలకృష్ణ సెట్‌లోకి నడిచి వస్తుంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి