‘స్క్విడ్ గేమ్’.. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్‌సీరిస్‌కు ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. త్వరలో ఈ వెబ్‌ సీరిస్‌ రెండో సీజన్ కూడా మొదలు కానున్నట్లు సమాచారం. అయితే, ఈ గేమ్‌కు లభించిన ఆధరణతో ఇప్పటికే చాలా గేమింగ్ సంస్థలు.. ‘స్క్విడ్ గేమ్’ థీమ్‌తో రకరకాల గేమ్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. పిల్లలు కూడా ఆ గేమ్స్‌ను ఆసక్తికరంగా ఆడుతున్నారు. అయితే, ‘మిస్టర్ బీస్ట్’ అనే యూట్యూబర్ ఏకంగా ‘స్క్విడ్ గేమ్’ సెట్ వేసి మరీ.. వెబ్ సీరిస్‌లో చూపించిన గేమ్స్ ఆడించాడు. 


మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డోనాల్డ్ సన్. ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమ్ అవుతున్న ‘స్క్విడ్ గేమ్’ చూసిన తర్వాత అతడికి ఓ క్రేజీ ఐడియా వచ్చింది. ఈ వెబ్‌ సీరిస్‌లో ఉన్న రెడ్ లైట్-గ్రీన్ లైట్, టగ్ ఆఫ్ వార్, గ్లాస్ హాప్ ఛాలెంజ్ గేమ్స్‌కు సంబంధించిన సెట్స్ వేశాడు. అనంతరం వెబ్‌ సీరిస్‌ తరహాలోనే 456 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసుకుని గేమ్స్ ఆడించాడు. ఇందులో విజేతగా నిలిచే వ్యక్తికి 4.56 లక్షల డాలర్ల(రూ.3.41 కోట్లు) బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. అంటే ఒక్కొక్కరికీ 10వేల డాలర్లు చొప్పున డిపాజిట్ చేశాడు. ఆ గేమ్‌లో ఎంతమంది ఓడిపోతారో ఆ డబ్బంతా.. విజేతగా నిలిచే వ్యక్తికి దక్కుతుంది.




రియల్ ‘స్క్విడ్ గేమ్‌’ ఆడిస్తానని జిమ్మీ చెప్పినప్పుడు అంతా జోక్ చేస్తున్నాడని, సాధ్యం కాదని అన్నారు. అయితే, నవంబరు 24న అతడి యూట్యూబ్ చూసినవారికి నోట మాట రాలేదు. ఎందుకంటే.. అతడు కంటెస్టెంట్లతో రియల్ ‘స్క్విడ్ గేమ్’ ఆడి చూపించాడు. వెబ్ సీరిస్‌లో చూపించినట్లే భారీ సెట్టింగులతో ఆకట్టుకున్నాడు. సాధారణంగా రెడ్ లైట్-గ్రీన్ లైట్ గేమ్‌లో ఓడినవాళ్లను వెబ్ సీరిస్‌లో చంపేస్తారు. అయితే, జిమ్మీ తన రియల్ ‘స్క్విడ్ గేమ్’లో ఏం చేస్తాడా అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. అయితే, రెడ్ లైట్-గ్రీన్ లైట్ ఆటను రక్తికట్టించేందుకు కంటెస్టెంట్ల టీ-షర్టుల్లో ప్రత్యేకమైన డివైస్ పెట్టాడు. ఆ గేమ్‌లో రెడ్ లైట్ అనేగానే కదిలే వ్యక్తులు ఓడిపోయినట్లు లెక్క. అలా ఓడిపోయేవారి టీ-షర్ట్‌లోని డివైస్ నుంచి పేలుడు ఏర్పడుతుంది. 






అయితే, తాడు లాగే ఆట మాత్రం కాస్త డేంజరస్‌గానే కనిపించింది. వెబ్‌సిరిస్‌లో చూపించినట్లే.. దాన్ని చాలా ఎత్తులో ఏర్పాటు చేశాడు. పైగా వాటి రైలింగ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. పొరపాటున ఎవరైనా కిందపడితే చనిపోయే ప్రమాదం ఉంది. యూట్యూబ్‌లో ఈ గేమ్ చూసిన చాలామంది. ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘స్క్విడ్ గేమ్’ పిచ్చి వల్ల ఎవరికైనా ఏమైనా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని నెటిజనులు అతడిని కడిగిపడేస్తున్నారు. అయితే, చివరి గేమ్ చాలా టఫ్‌గా ఉంటుందని అంతా భావించారు. కానీ, గ్లాస్ గేమ్ పూర్తయిన తర్వాత మాత్రం అతడు.. సింపుల్‌గా స్క్విడ్ గేమ్‌లో లేని మ్యూజికల్ ఛైర్ ఆడించి.. విజేతను నిర్ణయించాడు. విజేతకు రూ.3.41 కోట్లు ఇచ్చాడు. రన్నరప్‌గా నిలిచిన వ్యక్తికి రూ.7.49 లక్షలు ఇచ్చాడు. ఆ రియల్ స్క్విడ్ గేమ్ మీకూ చూడాలని ఉందా? ఇక్కడ చూసేయండి మరి.


Also Read: ఏపీలో ‘బూమ్ బూమ్’ అంటే మందిస్తారు.. ఆ దేశాల్లో మాత్రం దండిస్తారు, ఎందుకంటే..


వీడియో: 



Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? 
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి