వెంకటేష్ నటించిన ‘కలిసుందాం రా’ సినిమాలోని ‘‘బూమ్.. బూమ్ చికినకా లోకమంతా ఒక్కటి కావాలోయ్..’’ అంటూ ఆ దేశాల్లో పాట పాడినా లేదా మీ దగ్గర ‘బూమ్ బూమ్’ మందు ఉందా అని అడిగినా అడ్డంగా బుక్కవుతారు. మిమ్మల్ని ఎగాదిగా చూసి పోలీసులకు పట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేంటీ.. ఆ పాటలో, ఆ మాటలో అంత బూతేముంది? అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి ఆ పాటలో బూతు లేదు. అది మన దేశంలో తప్పు కూడా కాదు. కానీ, కొన్ని ఆసియా దేశాల్లో.. ‘బూమ్ బూమ్’ అంటే వేరే అర్థాన్ని తీసుకుంటారు. ఎందుకంటే.. అక్కడ అది తప్పుడు పదం. కేవలం మసాజ్ సెంటర్లు, వ్యభిచార గృహాల్లో మాత్రమే సీక్రెట్‌గా పలికే పదం ఇది. అయితే, ఈ పదానికి ప్రత్యేక చరిత్ర కూడా ఉంది. 


ఆసియా దేశాలైన థాయ్‌లాండ్, కాంబోడియా, లావోస్, వియత్నాం దేశాల్లో ‘బూమ్.. బూమ్’ పదాన్ని నిషేదించారు. దాన్ని తప్పుడు వ్యాఖ్యల సరసన చేర్చారు. ఎవరైనా ఆ పదాన్ని బహిరంగంగా పలికితే.. తప్పుగా భావిస్తారు. దీంతో ఆ పదాలను ఆ దేశాల్లో పలకొద్దని చాలామంది చెబుతారు. వాస్తవానికి ‘బూమ్ బూమ్’ అంటే సెక్స్ అని అర్థం. బాడీ మసాజ్‌లకు పేరొందిన పలు ఆసియా దేశాల్లో ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. అక్కడ బాడీ మసాజ్‌తోపాటు ఇతరాత్ర అసాంఘిక పనులు కూడా చేస్తారు. అందుకే చాలామంది ఆయా దేశాలకు క్యూ కడుతూ ఉంటారు. ఈ చర్యల వల్ల తమ దేశానికి చెడ్డ పేరు వస్తోందని.. అక్కడి ప్రభుత్వాలు మసాజ్ సెంటర్లలో లైంగిక చర్యలపై నిషేదం కూడా విధించింది. కానీ, చాపకింద నీరులా సాగుతూనే ఉన్నాయి. 


Also Read: కలర్‌ఫుల్ టౌన్.. ప్లాస్టిక్ బొమ్మలు కావు.. ఇవన్నీ ఇళ్లే! ఎక్కడో తెలుసా?


బూమ్ బూమ్ అంటే బూతు కాదు, కానీ..: ‘బూమ్ బూమ్’ అనేది బూతు కాదు. పైగా ఆసియా దేశాల్లోని భాషల్లో ఆ పదమే లేదు. ఆ పదాన్ని ఆయా దేశాల్లో పాపులర్ చేసింది.. అమెరికన్లే. 1960-70 మధ్య కాలంలో చోటుచేసుకున్న వియత్నాం యుద్ధంలో పాల్గొన్న అమెరికా సైనికులు.. అప్పుడప్పుడు స్థానిక వ్యభిచార గృహాలకు వెళ్లేవారు. అయితే, అక్కడి ప్రజలకు ఇంగ్లీష్‌పై అవగాహన లేకపోవడంతో ‘బూమ్.. బూమ్’ చేస్తావా అని అడిగేవారు. అప్పటి నుంచి ఆ పదాన్ని.. అందుకు మాత్రమే ఉపయోగించడం మొదలుపెట్టారు. అందుకే.. అక్కడి మసాజ్ పార్లర్‌లో అమ్మాయిలు.. ‘బూమ్ బూమ్’ కావాలా అని అడిగడం సర్వసాధారణమైంది. అయితే, ఇది కేవలం వియత్నానికి మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా సైనికులు ఇతర ఆసియా దేశాల్లో కూడా ఇదే పదాన్ని వాడేవారు. దీంతో ఆ పదం థాయ్, కాంబోడియా, లావోస్‌లకు కూడా పాకింది. అది క్రమేనా బూతు పదంగా మారింది. అందుకే, రాజ్ తరుణ్.. హెబ్బా పటేల్ నటించిన ‘21F’ సినిమాలోని ‘బ్యాంగ్ బ్యాంగ్.. బ్యాంకాక్’ అనే పాటలో ఓ మసాజ్ సెంటర్లో ‘బూమ్ బూమ్..’ అనే పదం వస్తుంది. దీంతో మన సెన్సార్ బోర్డు ఆ పదాన్ని పాట నుంచి తొలగించింది.


Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? 
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి