పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేరంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. పునీత్ మరణం తనను ఎంతగానో కలచి వేసిందని ఆయన తెలిపారు. బెంగళూరు వెళ్లిన రాజమౌళి, పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. దివంగత కథానాయకుడి ఫొటోకి నివాళులు అర్పించారు. ఆయన మరణవార్త విని షాక్ అయ్యానని అన్నారు.
పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాతే ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి తెలిసిందని రాజమౌళి అన్నారు. సాధారణంగా మనం ఓ చిన్న సాయం చేసినా ప్రపంచానికి తెలియాలని అనుకుంటామని, కానీ పునీత్ తాను ఎంత మందికి సహాయం చేసినా... తాను చేసిన సాయం గురించి ఎవ్వరికీ పునీత్ చెప్పలేదని దర్శక ధీరుడు వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల క్రితం బెంగళూరుకు వెళ్లినప్పుడు తొలిసారి పునీత్‌ను కలిశానని, అతనితో మాట్లాడుతుంటే ఓ స్టార్‌తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలగలేదని రాజమౌళి తెలిపారు. పునీత్ చాలా సరదాగా ఉండే మనిషి అని అన్నారు. తనను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. నిజంగా రాజమౌళి చెప్పినట్టు... పునీత్ రాజ్ కుమార్ సేవా కార్యక్రమాల గురించి ఆయన మరణం తర్వాతే ఎక్కువ మందికి తెలిసింది. పునీత్ గొప్పదనం గురించి పలువురు చెబుతున్నారు.
Also Read: రౌద్రం రణం రుధిరం మాత్రమే కాదు... రాజమౌళి చెప్పాలనుకున్నది అంతకు మించి!
ఇక, రాజమౌళి సినిమాలకు వస్తే... 'బాహుబలి' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' జనవరి 7న విడుదల కానుంది. రీసెంట్‌గా సోల్ యాంథమ్ 'జనని' పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు స్పందన బావుంది. ఎమోషనల్ గా ఉందని అందరూ అంటున్నారు.
Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?
Also Read: త్రివిక్రమ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు
Also Read: కంగనా రనౌత్ పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు... వివాదాస్పద వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని ఆర్డర్
Also Read: 456 మందితో రియల్ ‘స్క్విడ్ గేమ్’.. విజేతకు రూ.3.41 కోట్లు, ఓడినవాళ్లను ఏం చేశారంటే..
Also Read: ఒక్క రోజు ఆలస్యంగా 'మరక్కార్'... గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్!
Also Read: హీరోయిన్‌కు ఎదురైన సంఘటనల వల్లే 'అఖండ' ఎంట్రీ... బాలకృష్ణ సెట్‌లోకి నడిచి వస్తుంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి