బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలుకాగా.. ఇప్పుడు హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వీరిలో మానస్ తప్ప మిగిలిన వారంతా కూడా నామినేషన్ లో ఉన్నారు. షణ్ముఖ్, సన్నీ, రవి, కాజల్ ఇలా అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనే చెప్పాలి. ప్రియాంక, సిరిలకు తక్కువ ఓట్లు పడ్డాయని మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఈసారి ఎలిమినేషన్ ప్రాసెస్ లో బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

 

ఎవరూ ఊహించని విధంగా ఈసారి యాంకర్ రవి ఎలిమినేట్ కాబోతున్నారని సమాచారం. లాస్ట్ వరకు రవిని మరో కంటెస్టెంట్ తో ఉంచి అతడిని ఎలిమినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే.. హౌస్ లో ఉన్నవాళ్లలో రవి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్. మొదటి నుంచి కూడా గ్రూప్ లో ఉన్నప్పటికీ.. ఇండివిడ్యుయల్ గా తన గేమ్ ఆడుతున్నాడు. కెప్టెన్ కూడా అయ్యాడు. ఈ వారం కూడా కెప్టెన్ అవ్వాల్సిందే కానీ.. హౌస్ మేట్స్ సహకారం లేకపోవడంతో కెప్టెన్ ఛాన్స్ మిస్ అయ్యాడు. 

 

అలాంటి కంటెస్టెంట్ ఇప్పుడు ఎలిమినేట్ కానుండడం ఆశ్చర్యంగా ఉంది. నిన్ననే రవి ఫ్యామిలీ హౌస్ లోకి వచ్చింది. తన కూతురిని ఎత్తుకొని పొంగిపోయాడు రవి. తన కూతురు ఏడుస్తుంటే.. మరో మూడు వారాల్లో వచ్చేస్తానంటూ సముదాయించారు. కానీ ఈ వారమే వెళ్లిపోబోతున్నాడు రవి. లాస్ట్ మినిట్ లో బిగ్ బాస్ ఏమైనా డెసిషన్ మార్చుకుంటాడేమో చూడాలి!

 


 


 



Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి


Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?




 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి