పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ నష్టాలు మరింత పెరిగాయి! 2021, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.481 కోట్ల కన్సాలిడేటెడ్ లాస్‌ను నమోదు చేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికం నష్టం రూ.376 కోట్లతో పోలిస్తే ఇది మరింత ఎక్కువ కావడం గమనార్హం. ఇక గతేడాది ఇదే త్రైమాసికంతో పేటీఎం రూ.435 కోట్ల నష్టం నమోదు చేసింది.
వార్షిక కార్యనిర్వాహక రాబడి 64 శాతం పెరిగి రూ.1086 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ఇది రూ.663 కోట్లు కావడం గమనార్హం. యూపీఐ యేతర చెల్లింపుల్లో ఆదాయం 52 శాతం పెరగ్గా ఇతర సేవలు, ఆర్థిక సేవల్లో మూడు రెట్లు పెరిగింది. పేటీఎం స్టాక్ మార్కెట్లో నమోదైన తర్వాత ఫలితాలు విడుదల చేయడం ఇదే మొదటి సారి.
వార్షిక ప్రాదిపదికన చెల్లింపులు, ఆర్థిక సేవల ఆదాయం 69 శాతం పెరిగి రూ.842 కోట్లు నమోదైంది. కామర్స్, క్లౌడ్ సేవలు ఆదాయం 47 శాతం పెరిగి రూ.243 కోట్లుగా ఉంది. ఈ క్వార్టర్లో ఆర్థిక సేవల, ఇతర రాబడి 250 శాతం పెరిగి రూ.88.70 కోట్లుగా ఉంది. తమ గ్రాస్ మర్చండైజ్ విలువ (GMV) వార్షిక ప్రాతిపదికన 107 శాతం పెరిగి రూ.1,95,600 కోట్లుగా ఉంది. అక్టోబర్‌లో జీఎంవీ రూ.83,200 కోట్లుగా ఉండేది. ఇక నెలవారీ జీఎంవీ సగటున రూ.11,369 కోట్లుగా ఉంటోందని కంపెనీ తెలిపింది.
ఫలితాలపై కంపెనీ యాజమాన్యం మాట్లాడింది. తమ ఎకోసిస్టమ్‌లోని మార్చంట్ భాగస్వాములు పెరుగుతున్నారని వివరించింది. గతేడాది ఇదే సమయంలో 1.85 కోట్ల నమోదిత మర్చంట్స్ ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 2.3 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్, పేటీఎం ఆల్ ఇన్ వన్ పీఓఎస్, పేటీఎం సౌండ్‌బాక్స్ వంటి విధానాలు పెరగడంతో వ్యాపారుల సంఖ్య పెరిగిందని తెలిపింది. ఇక సెప్టెంబర్ క్వార్టర్లో వార్షిక ప్రాతిపదికన 28 లక్షల రుణాలు ఇచ్చామని తెలిపింది. కేవలం అక్టోబర్లోనే 13 లక్షల రుణాలు ఇచ్చామని వెల్లడించింది.
Also Read: Stock Market Crash: భయం.. భయం..! 100 కరోనా కేసులు.. రూ.6.5 లక్షల కోట్లు ఆవిరి!
Also Read: Electric Flying Taxi: ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఎగిరే అద్దె టాక్సీలు.. రెండు మార్గాలు ఏర్పాటు!
Also Read: LPG cylinder Price: ఇలా చేస్తే గ్యాస్ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు..!
Also Read: Cryptocurrency Ban: క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి.. బ్యాన్ చేస్తారా? ఏం జరుగుతోంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి