క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఆదివారం నిలకడగా కనిపించింది. విపరీతంగా కొనుగోళ్లేమీ లేవు కానీ ముఖ్యమైన కాయిన్ల ధర కాస్త మెరుగైంది. బిట్‌కాయిన్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ.77,08,356 కోట్లుగా ఉంది. రూ.42,84,666 వద్ద కొనసాగుతోంది.
ఇక ఎథిరెమ్ 1.87 శాతం పెరిగి రూ.3,24,124, బైనాన్స్ కాయిన్ 3.48 శాతం మెరుగై రూ.47,023, టెథెర్ 0.02శాతం పెరిగి రూ.78.66, సొలాన 4 శాతం పెరిగి రూ.15,409, కర్డానో 0.84 శాతం ఎగిసి రూ.123, రిపుల్ 0.46 శాతం పెరిగి రూ.74.76 వద్ద కొనసాగుతున్నాయి. యూఎస్‌డీ కాయిన్ 0.01 శాతం తగ్గి రూ.78.58, ఎయిర్‌స్వాప్ 0.56 శాతం తగ్గి రూ.38.13 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Stock Market Crash: భయం.. భయం..! 100 కరోనా కేసులు.. రూ.6.5 లక్షల కోట్లు ఆవిరి!
Also Read: Electric Flying Taxi: ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఎగిరే అద్దె టాక్సీలు.. రెండు మార్గాలు ఏర్పాటు!
Also Read: LPG cylinder Price: ఇలా చేస్తే గ్యాస్ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు..!
Also Read: Cryptocurrency Ban: క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి.. బ్యాన్ చేస్తారా? ఏం జరుగుతోంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి