ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన విఫలమయిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చేశారు. రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ కొత్త సంప్రదాయం ప్రారంభించిందని.. విపక్షం లేకుండా సభ నిర్వహించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని అన్నారు. అంతేకాకుండా కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని అప్పులపై నియంత్రణ లోపించిందని స్పష్టం చేశారు.
Also Read : త్రివిక్రమ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు
రాష్ట్రానికి 6 లక్షల 22 కోట్ల రూపాయలకు అప్పులు పెరిగాయని, గడిచిన రెండేళ్లలోనే వైసీపీ ప్రభుత్వం 3 లక్షలకు పైబడి అప్పులు చేసిందని లెక్కలు చెప్పారు. కాగ్ నివేదికపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ముందు ముందు అప్పులు కూడా పుట్టని పరిస్థితి వస్తుందని ఉండవల్లి మండిపడ్డారు. అప్పులు తగ్గించి ఆదాయం పెంచుకోనే మార్గాలను అన్వేషించాలని సీఎం జగన్‌కు ఉండవల్లి సలహా ఇచ్చారు.
Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
అసెంబ్లీలో సభ్యుల భాష గీత దాటిపోయిందని ఉండవల్లి మండిపడ్డారు. ఎన్టీఆర్ కుమార్తెపై అసెంబ్లీలో కొంత మంది ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఉండవల్లి తప్పు పట్టారు. హరికృష్ణ, పురందేశ్వరితో తనకు పరిచయం ఉందని..వారుచాలా మంది వాళ్లన్నారు. అదేసమయంలో ఎన్టీఆర్ కుమార్తెలపై తాను ఎలాంటి చెడు ప్రచారాలనూ వినలేదన్నారు. అంత దారుణంగా తిట్టినందుకే చంద్రబాబు విలపించారని ఆయనది డ్రామా అని తాను అనుకోవడం లేదన్నారు. సానభూతి రాదని చంద్రబాబుకూ తెలుసన్నారు.
Also Read : రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి.. ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం !
వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించకపోవడంపై విమర్శలు గుప్పించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఎప్పుడైనా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పర్యటించారా అని జగన్ అసెంబ్లీలో ప్రశ్నించడంపై ఉండవల్లి విమర్శలు గుప్పించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌పై ఎలాంటి ఆరోపణలు లేవని అందుకే గెలుస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. కానీ ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. అవినీతి లేనిదెక్కడో చూపించాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడం కనీస బాధ్యత అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ స్వయంగా వరద బాధిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారని.. ఆయన బాగా పని చేస్తున్నారని ఉండవల్లి తేల్చారు.
Also Read: సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !
చంద్రబాబును అంత దారుణంగా తిడుతున్నారని.. అలాంటి వారికి ప్రజల్లో గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఓ మంత్రి అయితే వాడు,వీడు అనడం సాధారణం అయిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితులతో ఏపీలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని ఉండవల్లి విమర్శించారు.
Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !