దశాబ్దాలుగా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమే. పేదలు పేదలుగానే ఉంటున్నారు. మధ్యతరగతివారు కూడా పేదలుగా మారుతున్నారు. ధనవంతులు మాత్రం మరింత ధనవంతులుగా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలో పేదలు ఎక్కువ అనే ఓ డౌట్ రావడం సహజమే. ఈ అనుమానాలకు నీతి ఆయోగ్ తెర దించింది. దేశం మొత్తం ఆశ్చర్యపోయే గణాంకాలను విడుదల చేసింది.


Also Read : కేంద్రం వడ్లు కొనదు... రైతులు వరి పండించొద్దు.. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటన


బీహార్‌లో సగం మందికిపైగా జనాభా పేదలే..! 


మన దేశంలో అత్యంత పేద రాష్ట్రం బీహార్‌. నీతిఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం బిహార్‌లో 51.91శాతం మంది పేద ప్రజలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో సగానికిపైగా జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. మానసిక ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు, వంట గ్యాస్‌, విద్యుత్తు సౌకర్యాలకు నోచుకోని ప్రజలూ బిహార్‌లోనే ఎక్కువ శాతం ఉన్నారు. అత్యధికంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రజల శాతం బిహార్‌లోనే ఎక్కువ.   ఆ తర్వాత 42.16 శాతంతో జార్ఖండ్‌, 32.67 శాతంతో యూపీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 36.65శాతం, మేఘాలయ 32.67 శాతం పేదలు ఉన్నారు.


Also Read : మరోసారి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు అస్వస్థత... ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స


కేరళలో అతి తక్కువ మంది పేదలు !


అత్యంత తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం కేరళ. అక్కడి జనాభాలో 0.71 శాతం మాత్రమే పేదరికంలో ఉన్నారు. అంటే కేరళలో ఒక్క శాతం కూడా పేదలు లేరన్నమాట. ఒక శాతం తక్కువ మందే పేదలు ఉండటంతో ఓ రకంగా అక్కడి ప్రజలంతా కూడు, గుడ్డ, నీడకు లోటు లేకుండా ఉన్నారు. తర్వాత స్థానంలో ఈశాన్య రాష్ట్రం సిక్కిం ఉంది. ఆ తర్వాత దక్షిణాదిలోని అతి పెద్ద రాష్ట్రం తమిళనాడు ఉంది. తమిళనాడులో  4.89శాతం మంది మాత్రమే పేదలు ఉన్నారు. పంజాబ్‌ 5.59శాతం ప్రజలు పేదరికంలో ఉ‌న్నారు.


Also Read: Vladimir Putin India Visit: డిసెంబర్‌లో భారత పర్యటనకు పుతిన్.. మోదీతో కీలక చర్చ


తెలుగు రాష్ట్రాల్లో కాస్త పర్వాలేదు..!


తెలుగు రాష్ట్రాల్లో పేదరికం మరీ ఎక్కువేమీ లేదు.. అలాగని మరీ తక్కువేమీ లేదు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 13.74శాతం పేదలున్నారు. ఈ జాబితాలో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. ఏపీ 20వ స్థానంతో కొంత మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రంలో 12.31 శాతం పేదలున్నారు.  పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు తెలంగాణలో 31.10శాతం, ఏపీలో 26.38శాతం ఉన్నారు. శిశువులు, యవ్వన దశలో మరణాలు ఏపీలో 1.82 శాతం, తెలంగాణలో 1.38శాతం సంభవిస్తున్నాయి.


Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి


పేదలు కాని వారంతా ధనవంతులు కాదు !


దేశంలో పేదరిక సూచికను తయారు చేయడానికి ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి చేసిన మెథడాలజీని ఉపయోగించారు.  నీతి ఆయోగ్‌ వెల్లడించింది. 2015-16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ఆధారంగా తీసుకున్నారు. అయితే పేదలు కానంత మాత్రాన వారంతా ధనవంతులు కాదు. కేవలం రోజువారీ అవసరాలకు సరిపడనంత సంపాదించుకుంటున్నవారిగా భావించవచ్చు. 


Also Read: Constitution Day 2021: 'రాజ్యాంగం మన దేశానికి ప్రాణవాయువు.. అంబేడ్కర్‌కు జాతి రుణపడి ఉంది'


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి