Constitution Day 2021: 'రాజ్యాంగం మన దేశానికి ప్రాణవాయువు.. అంబేడ్కర్‌కు జాతి రుణపడి ఉంది'

ABP Desam   |  Murali Krishna   |  26 Nov 2021 12:40 PM (IST)

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ సహా నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

'రాజ్యాంగం మన దేశానికి ప్రాణవాయువు.. అంబేడ్కర్‌కు జాతి రుణపడి ఉంది'

రాజ్యాంగ దినోత్సవాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా ఉభయ సభల సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ. 
భారతజాతి భవిష్యత్తు కోసం  72 ఏళ్ల క్రితం ఇదే సెంట్రల్‌ హాల్‌లో రాజ్యాంగాన్ని సభ ముందు ఉంచారు. మన రాజ్యాంగానికి ఉన్న శక్తి వల్ల మన దేశం అభివృద్ధి పయనంలో సాగిపోతోంది.   ఆది నుంచి మన దేశంలో మహిళలకు ఓటు హక్కు ఉండటమే కాదు ఎంతో మంది మహిళామణులు అసెంబ్లీకి ప్రాతినిథ్యం కూడా వహించారు. రాజ్యాంగ నిర్మాణంలో కూడా వారి పాత్ర ఎనలేనిది.                                                                                  -  రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
 
ప్రాణవాయువు..
 
1950 తర్వాత రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఏడాది నిర్వహించి ఉండాల్సింది. రాజ్యాంగాన్ని రూపొందించిన వారి గురించి అందరికీ అవగాహన ఉండాలి. కానీ గత ప్రభుత్వాలు అలా చేయలేదు. మన దేశానికి రాజ్యాంగం ప్రాణవాయువు లాంటింది.  రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ సభకు మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఎంతో మంది గొప్ప నేతలు ఈ రాజ్యాంగాన్ని మనకు అందించేందుకు కష్టపడ్డారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు ఈ భారతజాతి రుణపడి ఉంది. -                                                                 ప్రధాని నరేంద్ర మోదీ
 
ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై మోదీ పరోక్ష విమర్శలు చేశారు. తరతరాలుగా పార్టీని ఒకే కుటుంబం నడపడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు.

కుటుంబం కోసం పార్టీ, కుటుంబ పార్టీ.. ఇంతకన్నా ఏమైనా చెప్పాలా? తరతరాలుగా ఒకే కుటుంబానికి చెందిన వారు పార్టీని నడపడం అనేది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.                                                               -    ప్రధాని నరేంద్ర మోదీ

Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే

Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం

Also Read: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 26 Nov 2021 12:40 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.