వంటింటి గ్యాస్‌ ధరలు కొండెక్కుతున్నాయి..! ఒకప్పుడు రూ.500ల్లోపు ఉండే సిలిండర్ ధర ఇప్పుడు రూ.1000 వరకు ఎగబాకింది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ నగదు బదిలీ సైతం సక్రమంగా అవ్వడం లేదు. అయితే ఒక్కో సిలిండర్‌పై రూ.300 వరకు ఆదా చేసుకొనే మార్గం ఒకటుంది. ఇలా చేస్తే దేశంలోని ఎన్నో కుటుంబాలకు కొంత ప్రయోజనం దక్కుతుంది.


కొన్ని రోజుల ముందు వరకు వంటింటి గ్యాస్‌ బండ రూ.594 వరకు ఉండేది. అదిప్పుడు రూ.834కు ఆపై రూ.1000 వరకు చేరుకుంది. ఇప్పుడు రూ.300 వరకు సబ్సిడీ పొందాలంటే వారు తమ ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాను లింక్‌ చేయాలి. ధరల పెరుగుదలతో సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడని గమనించిన ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించుకుంది! ఇప్పటికే కొంత సబ్సిడీ పొందుతున్నవారు ఎక్కువ సబ్సిడీ పొందొచ్చు.


గతంలో ఒక సిలిండర్‌ కొనుగోలుపై సబ్సిడీని రూ.20 నుంచి 30కి తగ్గించారు. ఇప్పుడు దానిని రూ.300కు పెంచారు. ఉజ్వల పథకం కింద సిలిండర్లు తీసుకునే వారికి మరింత ప్రయోజనం కలుగనుంది. ఇంతకు ముందు వారికి రూ.174 వరకు సబ్సిడీ వచ్చేది. ఇప్పుడు దానిని రూ.312కు పెంచారు. గతంలో రూ.153 సబ్సిడీ పొందేవారు ఇప్పుడు రూ.291 వరకు పొందొచ్చు.


ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. మీ సబ్సిడీ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేయడమే. దానిని మళ్లీ మీ గ్యాస్‌ సరఫరదారు వద్ద నమోదు చేయించాలి. ఇండియన్‌ గ్యాస్‌ వినియోగదారులు cx.indianoil.in, భారత్‌ గ్యాస్ కస్టమర్లు www.ebharatgas.comకు లాగిన్‌ అయితే మరింత సమాచారం దొరుకుతుంది.  మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.


Also Read: IPO Allotment Status: ఎంత ట్రై చేసినా ఐపీవో కేటాయించడం లేదా..? ఇలా చేస్తే బెటర్‌!!


Also Read: Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్‌ కొనాలా? వద్దా? మార్కెట్లలో జోరైతే లేదు మరి!


Also Read: Vintage Cars: వింటేజ్ కార్లను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్.. ఎందుకంటే?


Also Read: Latent View Analytics Ltd: 3 రోజుల్లో రూ.14,972కు రూ.38,304 లాభం..!


Also Read: Cryptocurrency Survey: క్రిప్టోను నియంత్రించొద్దు ప్లీజ్‌..! సర్వేలో 54% మంది స్పందన ఇది


Also Read: Rich Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి