దయం నిద్ర నుంచి మేల్కోగానే చాలామందికి తలనొప్పి వస్తుంది. దీంతో మళ్లీ కాసేపు పడుకుని ఆ నొప్పిని తగ్గించుకోవాలని చూస్తారు. దాదాపు ప్రతి ఒక్కరిలో సాధారణంగా తలనొప్పి వస్తుంటుంది. దీనికి కారణం ఏమిటీ? దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? 
 
తలనొప్పితో నిద్ర మేల్కోవడమంటే.. ఎంత భారంగా అనిపిస్తుందో తెలిసిందే. ఆ తలనొప్పి వల్ల కాసేపు ఏ పనులు చేయలేరు. ఉదయం ఉత్సాహంగా ఉండలేరు. రోజు మొత్తం దాని ప్రభావం ఉంటుంది. ఉదయం వేళల్లో వచ్చే తలనొప్పికి అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి.. ‘హ్యాంగోవర్’. రాత్రి మద్యం తాగి నిద్రలేచేవారికి ఎక్కువగా తల పట్టేసినట్లుగా ఉంటుంది. తల బద్దలైపోతుందనే భావన కలుగుతుంది.


నిద్ర లేవగానే తలనొప్పి ఎందుకు వస్తుంది?: ఉదయాన్నే తలనొప్పితో నిద్రలేవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మద్యం, నిద్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు, మీరు తీసుకొనే వివిధ ఔషదాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా రాత్రి మద్యం తాగి నిద్రపోయేవారు డీహైడ్రేషన్‌(నిర్జలీకరణం)కు గురవ్వుతారు. అంటే.. శరీరానికి అవసరమైన నీరు లభించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. నిద్రలేవగానే.. శరీరంలోని అన్ని భాగాలు యాక్టీవ్ అవుతాయి. ఫలితంగా తలపై అకస్మాత్తుగా ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా తలనొప్పి ఏర్పడుతుంది. ఇది బ్రెయిన్‌లోని సబ్‌అరాక్నోయిడ్ రక్తస్రావం (మెదడులో రక్తస్రావం) మీద ఆధారపడి ఉంటుంది. 


రాత్రి వేళ్లలో అతిగా టాయిలెట్‌కి వెళ్లేవారిలో కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. అతిగా మూత్రం పోయడం వల్ల శరీరం నిర్జలీకరణకు గురవ్వుతుంది. మీరు తీసుకొనే ఆహారం, నిద్ర సంబంధిత సమస్యలు కూడా ఉదయం వేళల్లో తలనొప్పికి దారితీస్తాయి. నిద్రలేమి, గురక, స్లీప్ అప్నియా, దంత సమస్యలు, అతి నిద్ర, సిర్కాడియన్ రిథమ్ డిజార్డర్స్ వంటి సమస్యలు వల్ల కొందరిలో ఈ సమస్య ఏర్పడుతుంది. చివరికి తలనొప్పికి వేసుకొనే మందులు కూడా తలనొప్పికి దారి తీయొచ్చని యూకేకు చెందిన వైద్య నిపుణులు వెల్లడించారు. యాంటీ-యాంగ్జైటీ మందులు, ఆస్పిరిన్, పారాసెటమాల్, నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAID), ఓపియాయిడ్లు, ట్రిప్టాన్స్ వంటి మందుల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. 


తలనొప్పితో నిద్రలేచిన తర్వాత ఏం చేయాలి? నివారణ ఏమిటీ?: ఉదయం నిద్ర మేల్కొనేప్పుడు ఏర్పడే తలనొప్పి గురించి మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది దాదాపు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దీనికి నివారణ మార్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు వర్రీ కావద్దు. ఇది కేవలం మీ జీవనశైలి మీదే ఆధారపడి ఉంటుంది. ఉదయం మేల్కోగానే తీవ్రమైన తలనొప్పి వచ్చినా, ప్రతి రోజూ ఇదే సమస్య ఏర్పడుతున్నా వైద్యుడిని సంప్రదించాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత బ్రష్ చేసి.. ఒక గ్లాస్ నీళ్లు తాగడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. నిద్రలేచిన వెంటనే బెడ్ కాఫీ తాగడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుందని వైద్యులు తెలుపుతున్నారు.


☀ మీకు మద్యం తాగే అలవాటు ఉంటే రాత్రి వేళ తక్కువ మోతాదులో తీసుకోండి. 
☀ రాత్రి వేళ కెఫిన్ (టీ, కాఫీ, చాక్లెట్లు) వద్దు. నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీరు తాగి పడుకోండి. 
☀ నిద్రకు కొన్ని గంటల ముందే మందులను తీసుకోండి. 
☀ మీరు ఉండే పడక గది శుభ్రంగా ఉండేలా చూసుకోండి. 
☀ మందుల వల్ల తలనొప్పి వస్తున్నట్లు సందేహం కలిగితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. 
☀ ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సమస్య వస్తే.. తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాలి.
☀ రాత్రంతా టీవీలు, మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లు చూసి నిద్రించే అలవాటును తగ్గించుకోవాలి. 


Also Read: కోవిడ్-19 కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’.. ఇది డేల్టా కంటే డేంజరా? లక్షణాలేమిటీ?


Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? 
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి