మేషరాశి
ఈరోజు అద్భుతంగా ఉంటుంది. అవివాహితులు వివాహ ప్రతిపాదనను పొందుతారు. మిత్రుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో అనుకూలమైన లాభాలు ఉంటాయి. ఆఫీసులో ఎవరితోనైనా మనస్పర్థలు తలెత్తడం వల్ల మీరు ఆందోళన చెందుతారు. పెట్టుబడులు బాగానే కలిసొస్తాయి. సమయం అనుకూలంగా ఉంటుంది. బద్దకంగా ఫీలవుతారు.  కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. 
వృషభం
ఈ రోజు మీరు సానుకూలంగా ఉంటారు. చుట్టుపక్కల వారితో ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారం సజావుగా సాగుతుంది. మిత్రుల సహకారం వల్ల లాభాలు పెరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. పొదుపు చేయండి. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.  శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉంటుంది.
మిథునం
లాభదాయకమైన అవకాశాలు ఈరోజు వస్తాయి. బయటి నుంచి సకాలంలో డబ్బులు రాకపోవడంతో నిరాశకు గురవుతారు. ఎవరినీ అపహాస్యం చేయవద్దు.  విచారకరమైన వార్తలు అందుకోవచ్చు. బాధ్యతను నిర్వర్తించడానికి కష్టపడాలి. మీకు కిందిస్థాయి అధికారుల మద్దతు లభించదు. అలసట  చెందుతారు.  వ్యాపారులకు కలిసొచ్చేరోజు. 
Also Read:  పుష్కరాల సమయంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలని ఎందుకంటారు...
కర్కాటకం
గౌరవం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించేముందు ఆలోచిస్తారు. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ర్యాలయంలో శుభవార్త వింటారు. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో అనుకూల లాభాలు ఉంటాయి. పాత స్నేహితులు, బంధువులను కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి.
సింహం
మీరు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టు ప్రారంభించగలుగుతారు. మిత్రులను కలిసే అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలొస్తాయి. తొందరపాటు మానుకోండి. విచక్షణ ఉపయోగించండి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. అదృష్టం కలిసొస్తుంది.  కార్యసాధనతో సంతోషం ఉంటుంది. శ్రమకు తగిన విజయం లభిస్తుంది.
కన్య
దంపతులు సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త ఉద్యోగాలు దొరుకుతాయి. పనిలో సంతృప్తి ఉంటుంది. ఎక్కువ ఖర్చు ఉంటుంది. పరీక్షలు,  ఇంటర్వ్యూ ల్లో  విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో మందగమనం తగ్గుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.
Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..
తుల
పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.  కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు చేయవలసి వస్తుంది. శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తొందరపడకండి. మీ ప్రసంగాన్ని నియంత్రించండి. పని చేయాలని అనిపించదు. మీ విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకోండి.
వృశ్చికం
మతపరమైన ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త పనులు మొదలుపెడతారు.  వ్యాపారంలో లాభాలు రావడంతో సంతోషంగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. తెలియని భయం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆనందం ఉంటుంది. తొందరపడకండి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. శారీరక నొప్పి దూరమవుతుంది. 
ధనుస్సు
బంధువులు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సృజనాత్మక పని విజయవంతమవుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. గౌరవం పెరుగుతుంది.  ప్రమాదకర పనులు జాగ్రత్తగా చేయండి. 
Also Read: ఆదిశంకరాచార్యులను అమ్మవారు ఎందుకు కబళించాలని అనుకున్నారు? పాచికలాటలో గెలిచిందెవరు?
మకరం
ఈరోజు మంచి రోజు అవుతుంది. తెలియని అడ్డంకిని అధిగమిస్తారు. బాధ్యతను సకాలంలో నిర్వర్తించగలుగుతారు. వ్యాపారం లాభిస్తుంది. పెట్టుబడి పెట్టడానికి తొందరపడకండి. ఆదాయం కొనసాగుతుంది. మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. భారీ వస్తువుల వాడకంలో జాగ్రత్త వహించండి. మీ ప్రసంగాన్ని నియంత్రించండి.
కుంభం
మీ ఒత్తిడి దూరమవుతుంది. విలువైన వస్తువుల పట్ల నిర్లక్ష్యం వద్దు.  సంతోషంగా ఉంటారు. వ్యాపారం పెరుగుతుంది. పెట్టుబడులు బాగానే ఉంటాయి. ఉపాధి పెరుగుతుంది. లాభాల అవకాశాలు వస్తాయి. మీరు ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. 
మీనం
మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది.  డబ్బు సంపాదించే అవకాశం ఉంది. స్నేహితులతో సమావేశం కావచ్చు. బాధలు దూరమవుతాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. అదృష్టం కలిసొస్తుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ఎవరికీ అప్పు ఇవ్వకండి.
Also Read: చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు... ఈ మూడు పేర్లు తెలుసా.. అందుకే కన్ఫూజనా..!
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
Also Read: భక్తి తొమ్మిది రకాలు.. ఇందులో మీరు అనుసరిస్తున్న విధానం ఏంటి..
Also Read: రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
Also Read: కార్తీక దీపాలు నదులు, చెరువుల్లోనే ఎందుకు వదులుతారు...
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌