అఖండ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నందమూరి కుటుంబానికి, మా కుటుంబానికి ఎప్పట్నుంచో అనుబంధం ఉంది. ఎన్టీఆర్‌తో మా తాతయ్య అల్లు రామలింగయ్యకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన సినిమా ఫంక్షన్‌కు రావడం నాకు ఆనందంగా ఉంది.’
‘బోయపాటి శ్రీను మొదటి సినిమా భద్ర నేనే చేయాల్సింది. కానీ ఆర్య కారణంగా చేయలేకపోయాను. నేను బాగా ఇష్టపడే వ్యక్తుల్లో, నన్ను బాగా ఇష్టపడే వ్యక్తుల్లో బోయపాటి శ్రీను ఉంటారు. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. థమన్ ముట్టుకుందల్లా బంగారం అవుతుంది. కొట్టిందల్లా సిక్సర్ అవుతుంది.’
‘కరోనా సమయంలో మేం(నిర్మాణంలో) ఐదు సినిమాలు హోల్డ్ చేశాం. సినిమా ఆపుకుని కూర్చోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ సినిమా అఖండమైన విజయం సాధించాలని కోరుకుంటున్నామని నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి గురించి మాట్లాడుతూ చెప్పారు.’
‘శ్రీకాంత్ అన్నయ్యకు ఇది రెండో ఇన్నింగ్స్ అవ్వాలి. ఆయన కూడా సక్సెస్ అవ్వాలి. డైలాగులు చెప్పడంలో బాలయ్య గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రీల్ లైఫ్‌లో అయినా, రియల్ లైఫ్‌లో అయినా బాలకృష్ణ రియల్‌గానే ఉంటారు. అది బాలయ్య గారిలో నాకు పర్సనల్‌గా నచ్చే క్వాలిటీ.’
‘కరోనా సమయంలో చిన్న సినిమాలు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ద్వారా గట్టెక్కాయి. కానీ పెద్ద సినిమాలది మామూలు కష్టం కాదు. సెకండ్ వేవ్ తర్వాత ధైర్యం చేసి విడుదల చేస్తున్న మొదటి పెద్ద సినిమా అఖండ అన్‌స్టాపబుల్ సక్సెస్ అవ్వాలి. ఆ తర్వాత వస్తున్న పుష్ప, ఆర్ఆర్ఆర్, చిన్నా, పెద్దా సినిమాలు అన్నిటినీ ఆడియన్స్ సపోర్ట్ చేయాలి.’ అన్నారు. చివర్లో జై బాలయ్య అంటూ స్పీచ్ ముగించారు.
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మరణించే వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు - రాజమౌళి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి