విశాఖ జిల్లా కసింకోట మండలం ఏఎస్ పేటకు చెందిన అప్పలరాజుకు గొండుపాలెం గ్రామానికి చెందిన సంధ్య అనే యువతితో గతేడాది నవంబర్​లో వివాహమైంది. వీరికి మగ శిశువు జన్మించాడు. దంపతులిద్దరూ అచ్యుతాపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. శుక్రవారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చారు. భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. రాత్రి పది గంటల సమయంలో ఏడిస్తే సంధ్య పిల్లాడికి పాలు పట్టింది. అనంతరం అందరూ నిద్రపోతున్న సమయంలో శిశువును నీటి డ్రమ్ములో పడేసి హత్య చేసింది. అర్ధరాత్రి సమయంలో శిశువు కనిపించకపోవడంతో అప్పలరాజు బాబు కోసం వెతికాడు. సంధ్యను అడిగితే పొంతన లేని సమాధానం చెప్పడంతో ఇంటి చుట్టుపక్కలా వెతికాడు. ఫలితం లేకపోవడంలో 100 నంబర్​కు ఫోన్ చేశాడు. తండ్రి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు... సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి సమీపంలో గాలింపు చేపట్టగా నీటి డ్రమ్ములో శిశువు మృతదేహం లభించింది. 


Also Read: ఫ్రెండ్‌ లవర్‌పై కన్నేశాడు.. శవమై కనిపించాడు... సినిమా థ్రిల్లర్‌కు మించిన క్రైమ్‌ లవ్‌స్టోరీ..!


Also Read: సిరివెన్నెలకి తీవ్ర అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్..


చిన్నారిని నీటి డ్రమ్ములో పడేసి...


ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కన్నతల్లే తన శిశువును హతమార్చినట్లు గుర్తించారు. సంధ్యకు మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించిన పోలీసులు...వైద్యులను సంప్రదించారు. చిన్నారికి పాలు పట్టే సమయంలో నొప్పి వస్తున్నట్లు సంధ్య తన కుటుంబసభ్యులకు చెప్పినట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే శిశువును హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై నిందితురాలిని విచారించగా శిశువును తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. అందరూ నిద్రపోతున్న సమయంలో చిన్నారిని నీటి డ్రమ్ములో వేసి చంపినట్లు ఒప్పుకుంది. నిందితురాలి వాంగ్మూలంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితురాలిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. నిందితురాలి మానసిక స్థితిపై వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


Also Read: పగలు రెక్కీ రాత్రుళ్లు చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు


Also Read:  హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. 


Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి