కరీంనగర్ స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మేయర్ సర్థార్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్‌ఎస్ లో ఉన్న రవీందర్ సింగ్ నామినేషన్ వేయడంతో పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా నుంచి ఇటీవల పార్టీలో చేరిన ఎల్‌ రమణ, మరో ఎమ్మెల్సీ భానుప్రకాశ్‌ రావుకు అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీ స్థానం ఆశించిన రవీందర్ పార్టీ అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: పార్టీ నిర్ణయాన్ని కాదని ఇండిపెండెంట్లకు మద్దతు ...తెలంగాణ బీజేపీలో ఈటల కలకలం !


డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలవలేరు


కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. మాజీ మేయర్ రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఉద్యమ ద్రోహులను దగ్గరికి చేర్చుకున్న సీఎం కేసీఆర్ ఉద్యమకారులను అవమానిస్తున్నారని ఆరోపించారు. తనకు మద్దతు తెలిపిన నాయకులను బెదిరించి ఫోర్జరీ కేసులు పెట్టి భయపెడుతున్నారని విమర్శించారు. కానీ చివరి వరకు పోరాడతానని రవీందర్ సింగ్ అన్నారు. డబ్బుల సంచులతో ఎన్నికల్లో గెలవాలని భానుప్రసాద్ రావు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల నాయకుల కోసం తాను పోరాడానన్నారు. ఎంతో కష్టపడి కరీంనగర్ కు స్మార్ట్ సిటీని సాధిస్తే దాన్ని డబ్బు సంపాదనకు మార్గంగా కొందరు నాయకులు ఎంచుకున్నారన్నారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మానుకోటలో కొట్లాడిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారని, మరోవైపు పదవి పోయిన నాలుగు నెలల్లోనే కవితకు ఎమ్మెల్సీ ఇచ్చారన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి నిద్ర లేని రాత్రులు తప్పవన్నారు. హుజురాబాద్ పరిస్థితే కరీంనగర్ లో ఎదురౌతుందని రవీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. 


Also Read: పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !


ఏ రాష్ట్రంలోనూ 11 మంది విప్ లు లేరు : గోనె ప్రకాశ్


తెలంగాణ  తొలి ముఖ్యమంత్రి దలితుడే అని చెప్పిన కేసీఆర్ మాట మార్చి తానే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ ఆరోపించారు. బర్రెలు, గొర్రెలు, పెన్షన్లు కాదని రాజ్యాధికారం ఇచ్చిన రోజే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు ముందస్తు  తీర్పు ఇచ్చినా వందల కోట్లు ఖర్చుపెట్టారని విమర్శించారు. డబ్బులు ఇచ్చిన వాళ్లకు టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇస్తుందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేరే వాళ్లు నామినేషన్లు వేస్తే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. దీనికి ఆదిలాబాద్, హైదరాబాద్ లో జరిగిన సంఘటనలే సాక్ష్యం అన్నారు. ఎమ్మెల్సీ స్థానానికి రవీందర్ సింగ్ అర్హుడని, ఆయనకి ఓటు వేసి గెలిపించాలి కోరారు. ఓటర్లు ఆలోచన చేసి రవీందర్ సింగ్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 11 మంది విప్ లు లేరని గోనె ప్రకాశ్ విమర్శించారు. ఉద్యమాలలో లేనివారికి అవకాశం కల్పించి ఉద్యమంలో ఉన్న వారికి ద్రోహం చేశారన్నారు. 


Also Read:  తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి