సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న భారీ దొంగతనం జరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన పాత నేరస్థుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాత్రుళ్లు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు గఫార్ ఖాన్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కేజీ 805 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1,90,000 నగదు, ఒక బైక్, 10 మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మొత్తం రూ.93,62,500 విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇతడు ఇప్పటికే 27 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని తెలిపారు.
Also Read: ఫ్రెండ్ లవర్‌పై కన్నేశాడు.. శవమై కనిపించాడు... సినిమా థ్రిల్లర్‌కు మించిన క్రైమ్ లవ్‌స్టోరీ..!
పాత నేరస్థుడే మళ్లీ దొంగతనాలు
ఈ వివరాలను రాచకొండ పోలీస్ కమిషనరేట్ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సరూర్‌నగర్, సీసీఎస్ ఎల్‌బీ నగర్ పోలీసులు ఈ కేసులో నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు కమిషనర్ మహేశ్ భగవత్ తెలియజేశారు. నిందితుడు గఫార్ ఖాన్ అలియాస్ జిగర్ పాత నేరస్థుడని తెలిపారు. గతంలో రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. 2018లో మలక్‌పేట పోలీసులు నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. 2019లో ఆదిబట్ల పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపారన్నారు. అనంతరం జైలు నుంచి విడుదలయ్యాక 2019 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ నేరాలకు పాల్పడినట్లు మహేశ్ భగత్ వెల్లడించారు. దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను మరో నిందితుడు ఖాజా పాషాకి విక్రయించాడని తెలిపారు. ఈ డబ్బులను ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో ఖర్చు చేసేవారని పోలీసులు తెలిపారు.
Also Read: హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి..
ఆన్ లైన్ వ్యాపారం పేరుతో మోసాలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం షేర్‌మహ్మద్‌పురానికి చెందిన నాగేశ్వరరావు అంబేడ్కర్ వర్సిటీ ఎదురుగా నెట్ సెంటర్ నడుపుతున్నాడు. ఆన్‌లైన్ సేవలతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే సామాగ్రి విక్రయించేవాడు. దీంతో స్థానికంగా పరిచయాలు పెంచుకున్నాడు. తాను ఆన్‌లైన్ వ్యాపారం చేస్తున్నానని డబ్బులు పెట్టుబడి పెడితే నెల రోజుల్లో రెట్టింపు అవుతాయని నమ్మించాడు. తనకున్న కంప్యూటర్ నాలెడ్జ్ తో ఓ యాప్ రూపొందించాడు. ముందు వేల రూపాయల పెట్టుబడులను వసూలు చేసి అనుకున్న సమయానికి తిరిగి ఇచ్చేవాడు. దీంతో నాగేశ్వరరావుపై నమ్మకం ఏర్పడింది. ఇలా చాలా మంది లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో అదును చూసి బోర్డు తిప్పేశాడు. రాత్రికి రాత్రే కుటుంబంతో సహా ఊరి విడిచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితులు నాగేశ్వరరావు ఫోన్ నంబర్లకు కాల్ చేసి ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు.
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం