ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. స్టూడెంట్స్‌ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అందులో ఓ వ్యక్తి లవ్‌ ఎఫైర్‌ ఉంది. దీన్ని గమనించిన తోటి ఫ్రెండ్‌ అతని లవర్‌పై కన్నేశాడు. అంతే వార్ మొదలైంది. చివరకు హత్యకు దారి తీసింది. 
సినిమా స్టోరీలా ఉన్న ఈ సంఘటన అనంతపురం జిల్లా వజ్రకరూర్‌లో జరిగింది. ఈ కేసును పది రోజుల్లోనే ఛేదించిన పోలీసులు... పూర్తి వివరాలు తెలిసి షాక్ తిన్నారు. 


మండ్ల తిరుపాల్, బెస్త గురుమూర్తి మంచి ఫ్రెండ్స్. యునైటెడ్ స్టూడెంట్స్ ఆఫ్‌ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నాడు తిరుపాల్. తన మిత్రుడు గురుమూర్తికి లవ్‌ ఎఫైర్‌ ఉందని... లవర్‌తో ఉందని గుర్తించాడు తిరుపాల్. అంతే అప్పటి నుంచి ఆమెపై కన్నేశాడు. తానో విద్యార్థి సంఘ నాయకుడు అనే సంగతి మరిచిపోయి తన కోరికి తీర్చేందుకు ఆమె పంపించాలని గురుమూర్తి వెనుకాల పడ్డాడు. ఒకట్రెండు రోజులు కాదు... ఏకంగా రెండేళ్లుగా ఇలా వేధించాడు. ఆమెను పంపేందుకు అంగీకరించడని గ్రహించిన తిరుపాల్‌... డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశాడు. 
తిరుపాల్‌ వేధింపులు ఎక్కువయ్యే సరికి దిక్కు తోచని స్థితిలో పడిపోయాడు గురుమూర్తి. తన స్నేహితుల వద్ద విషయాన్ని చెప్పి బోరుమన్నాడు. స్నేహితులతో కలిసి ఆవుల ఎర్రిస్వామిని కలిశాడు గురుమూర్తి. అంతా కలిసి ఓ పరిష్కారం కనుక్కున్నారు. 
తిరుపాల్‌ను ఎదుర్కోవడం కష్టమని... చంపేస్తే సమస్య పరిష్కారం అవుతుందని ప్లాన్ చేశారు. దీని కోసం మూడున్నర లక్షలకు బేరం కుదుర్చుకొన్నాడు గురుమూర్తి. రంగంలోకి దిగిన ఆవుల ఎర్రిస్వామి పలు కేసుల్లో తన పాత మిత్రులైన చాకలి సునీల్, మఠం వేణుగోపాల్‌తో కలిసి ఈ నెల24వ తిరుపాల్‌కు స్పాట్ పెట్టారు. 
మాయ మాటలు చెప్పి తిరుపాల్‌ను బయటకు తీసుకెళ్ళారు. వజ్రకరూరు శివార్లలోని కనుమ మిట్ట వద్దకు తీసుకెళ్ళి హత్య చేశారు. డెడ్‌బాడీని ముక్కలుగా కోసేసి... కమలపాడులోని నాగప్ప బావిలో పడేశారు. తిరుపాల్ స్కూటర్‌ను కూడా అదే బావిలో పడేశి వెళ్లిపోయారు. 
తన బిడ్డ కనిపించడం లేదంటూ తిరుపాల్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్నేహితులను ముందుగా విచారించారు. విచారణలో పోలీసులు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్టూడెంట్ లీడర్‌గా ఉంటూనే ఇంత దారుణంగా ఫ్రెండ్‌ను వేధించడంతోనే హత్యగు గురైనట్టు అంచనాకు వచ్చారు పోలీసులు. గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి. 
హత్యకు సుపారీ తీసుకున్న ఆవుల ఎర్రిస్వామితోపాటు, చాకలి సునీల్, మఠం వేణుగోపాల్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు గుంతకల్ డీఎస్పీ నరసింగప్ప. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా ఉండే తిరుపాల్ కేవలం తన  శారీరక కోరిక కోసం బలయ్యాడని తెలిపారు డీఎస్పీ. వజ్ర కరూరులో జరిగిన ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 2రోజుల్లోపు తేల్చేసి నిందితులను కటకటాల వెనుక్కి పంపారు.


Read Also: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త


Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి


Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి


Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి