రోనా వైరస్ (కోవిడ్-19).. ఇప్పట్లో ప్రపంచాన్ని విడిచేలా లేదు. సమయం గడిచేకొద్ది రూపాంతరం చెందుతూ మరింత ప్రాణాంతంగా మారుతుందేగానీ.. పూర్తిగా నాశనం కావడం లేదు. ఇటీవల కోవిడ్ డెల్టా వేరియెంట్ ఇండియాను ఎంతగా వేదించిందో తెలిసిందే.. ఈ భయానక వైరస్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో చావును పలకరించి వచ్చారు. ఇది సరిపోదన్నట్లు కొత్తగా మరో కొత్త వేరియెంట్ ప్రజలపై దాడి చేయడానికి సిద్ధమైందనే వార్త ప్రపంచాన్ని మరోసారి కలవర పెడుతోంది. ఆ కొత్త వేరియెంట్ పేరే ఒమిక్రాన్ (Omicron). 


దక్షిణాఫ్రికాలో కొత్త Corona Virus వేరియెంట్‌కు సంబంధించిన తొలి కేసు నమోదైంది. హాంగ్‌కాంగ్, బెల్జియంలో కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization-WHO) అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఇది చాలా ప్రమాదకరమైనదని పేర్కొంది. కోవిడ్-19 ఎపిడెమియాలజీలో హానికరమైన మార్పును సూచించే ఆధారాలను పరిశోధకులు గుర్తించారు. B.1.1.529 అనే ఈ వేరియెంట్‌కు ఓమ్రికాన్ అని పేరుపెట్టింది.


ఈ వేరియంట్‌లో కోవిడ్-19 స్పైక్ ప్రొటీన్‌లో దాదాపు 30 మ్యుటేషన్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఇది చాలా సులభంగా వ్యాపిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ వేరియెంట్ టీకాల ద్వారా లభించే రోగ నిరోధకశక్తిని సైతం ఎదుర్కోగలదని పరిశోధకులు తెలిపారు. ఇప్పటివరకు టీకాలు వేయించుకోవాని వ్యక్తులకు ఇది చాలా ప్రమాదకరమైనది అంటున్నారు. టీకాలను రెండు డోసులు వేయించుకున వ్యక్తులు కూడా ఈ వైరస్‌ నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మీరు రెండు డోసులు వేసుకుని దాదాపు రెండు నుంచి మూడు, నాలుగు నెలలు గడిచినట్లయితే.. ఈ వైరస్ నుంచి జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. 


ఇది చాలా వేగవంతమైనది: వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 కంటే ఎక్కువ మ్యూటేషన్స్ గల ఈ వేరియెంట్ చాలా వేగంగా ఇతరులకు వ్యాపిస్తుంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగులకు సైతం తిరిగి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యూటేషన్స్ వల్ల వైరస్ శరీర కణాల్లోకి చాలా సులభంగా చొచ్చుకుపోతాయి. ఇది ఇతర వేరియెంట్స్ కంటే చాలా ప్రమాదకరమైనది. ఈ వేరియెంట్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే.. బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా మాస్క్‌లు ధరించాలి. సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ వాడటం తప్పనిసరి. ముఖ్యంగా వృద్ధులు తప్పకుండా టీకాలు వేయించుకుని.. ఇళ్లల్లో ఉండాలి. బూస్టర్ డోస్ తీసుకోనేవారు మరింత సేఫ్. 


డెల్టా కంటే డేంజర్: ఈ వేరియెంట్ సోకినవారికి కూడా గత కోవిడ్ లక్షణాలే ఉంటాయి. అయితే, దీని తీవ్రత.. వ్యాప్తిలో మాత్రం వ్యత్యాసం ఉంటుందని వైద్యులు అంటున్నారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం, ఆగకుండా దగ్గు రావడం, రుచి-వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించవచ్చు. ఈ జన్యువులో 50 వరకు మ్యూటేషన్లు ఉంటే.. వాటిలో 30 స్పైక్ ప్రోటీన్లు ఉన్నాయి. ఇండియాలో వ్యాపించిన డెల్టా వేరియంట్‌లో 13 మ్యూటేషన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 30 కంటే ఎక్కువ మ్యూటేషన్లు ఉన్న ఈ కొత్త వేరియెంట్ ఎంత భయానకంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది డెల్టా, ఆల్ఫా కోవిడ్ జాతులకు భిన్నంగా ఉంది. డెల్టా వేరియంట్ కంటే 500 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. 


ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త: మన దేశంలో ఇప్పుడు కోవిడ్ గురించి పెద్దగా ఆందోళన లేదు. పైగా ప్రజలు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ధైర్యంగా తిరిగేస్తున్నారు. దేశవిదేశాల నుంచి కూడా రాకపోకలు పెరిగిన నేపథ్యంలో.. Covid-19కు చెందిన Omicron వేరియెంట్ ఇప్పటికే ఇండియాలోకి ప్రవేశించినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కాబట్టి.. ముందుగానే మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం. అలసట, గొంతు మంట, తలనొప్పి, అతిసారం (అతిగా మలమూత్రాలు రావడం), చర్మంపై దద్దుర్లు, వేళ్లు లేదా కాలి రంగు మారడం, చిరాకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస ఆడకపోవడం, కదల్లేకపోవడం, గందరగోళంగా అనిపించడం, ఛాతి నొప్పి.. ఈ కొత్త వేరియెంట్ లక్షణాలు. ఓమిక్రాన్ వేరియెంట్‌ను కూడా కేవలం RT-PCR పరీక్షల ద్వారా మాత్రమే గుర్తించగలం.


Also Read: ఏపీలో ‘బూమ్ బూమ్’ అంటే మందిస్తారు.. ఆ దేశాల్లో మాత్రం దండిస్తారు, ఎందుకంటే..  
 
అప్రమత్తంగా ఉండాలి: ఈ వేరియెంట్‌కు సంబంధించి ఇండియాలో కేసులు నమోదైనట్లు సమాచారం లేదు. అయితే, ఆయా దేశాల ప్రజలు ఇండియాకు వచ్చినట్లు తెలిసింది. జింబాబ్వే, బెల్జియం, బోట్స్వానా, ఇజ్రాయెల్, హాంకాంగ్‌లోనూ కొత్త వేరియెంట్ కేసులను గుర్తించారు. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే 24 గంటల్లో 2465 కేసులు నమోదయ్యాయి. కాబట్టి.. కోవిడ్‌ ఇంట్లోకి వచ్చేవరకు వెయిట్ చేయకండి. ఈ రోజు నుంచి మళ్లీ మాస్కులు సక్రమంగా ధరిస్తూ.. అనారోగ్యంగా ఉండే వ్యక్తులకు కాస్త దూరం పాటించండి. 


Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? 
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి