తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయనకు పితృవియోగం కలిగింది. శ్రీను వైట్ల తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఈ రోజు (ఆదివారం, నవంబర్ 28న) తెల్లవారుజామున నాలుగు గంటలకు కన్నుమూశారు. శ్రీను వైట్ల స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కందుల పాలెం. ఆయన తండ్రి అక్కడే నివసిస్తున్నారు. గత కొన్నిరోజులుగా కృష్ణారావు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన మృతితో శ్రీను వైట్ల కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే హైద‌రాబాద్‌లో ఉన్న శ్రీ‌ను వైట్ల కుటుంబం సొంతూరికి ప్రయాణం అయినట్టు సమాచారం. ఆయన సోదరుడు ఒకరు అమెరికాలో ఉంటున్నట్టు తెలిసింది. కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ విషయం తెలిసి కందుల పాలెం ప్రయాణం అవుతున్నారు. పలువురు ప్రముఖులు శ్రీను వైట్లకు ఫోన్ చేసి తమ సంతాపం వ్యక్తం చేశారు.


సినిమాలకు వస్తే... విష్ణు మంచు హీరోగా త్వరలో 'ఢీ అండ్ ఢీ' సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి శ్రీను వైట్ల సన్నాహాలు చేస్తున్నారు. డబుల్ డోస్... అనేది క్యాప్షన్. వాళ్లిద్దరి కలయికలో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'ఢీ'కి సీక్వెల్ ఇది. ఈ సినిమా కోసం విష్ణు మంచు బాడీ బిల్డ్ చేస్తున్నారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో శ్రీను వైట్ల కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకుంది. అందువల్ల, సినిమా చిత్రీకరణ కొంత ఆలస్యంగా ప్రారంభం కావచ్చు.

సొంతూరిలోని ఇంట్లో శ్రీను వైట్ల:





Also Read: యశ్‌కు క్షమాపణలు చెప్పిన అమీర్‌ఖాన్.. ‘కేజీఎఫ్ 2’కు ప్రచారం చేస్తానని వెల్లడి


Also Read:బిగ్ బాస్ ట్విస్ట్.. ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్‌



Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి