'జబర్దస్త్' కార్యక్రమంలో అనసూయ భరద్వాజ్‌ అంటే పడి చస్తున్నట్టు 'హైపర్' ఆది స్కిట్స్ చేస్తూ ఉంటారు. అనసూయ కౌగిలి కోసం ఆరాట పడుతున్నట్టు... ఆమె స్పర్శ కోసం తహతహ లాడుతున్నట్టు 'హైపర్' ఆది హంగామా చేస్తుంటారు. దానిని ఇష్టపడే వీక్షకులు కొంత మంది ఉన్నారు. అందుకే, అతడి స్కిట్స్‌కు వ్యూస్ మిలియ‌న్స్‌లో ఉంటున్నాయని చెప్పుకోవాలి. డిసెంబర్ తొలి వారంలో అనసూయ - ఆది అభిమానులకు మరో నవ్వుల నజరానా సిద్ధమైనట్టు ఉంది.


డిసెంబర్ తొలి వారంలో ప్రసారం కానున్న 'జబర్దస్త్' కార్యక్రమంలో 'హైపర్' ఆది స్కిట్‌లో అనసూయ ఓ రోల్ చేశారు. 'మా ఇంటి లాక్ పోయింది. ఒక లాక్ ఇవ్వవా?' అని అనసూయ అడగ్గా... 'అరే! నువ్వు అడగలే కానీ' అని ఆది అనడమే ఆలస్యం, జడ్జ్ సీటులో ఉన్న రోజా పంచ్ వేశారు. 'లిప్ లాక్ అయినా ఇచ్చేస్తాడు' అని! 'నా చెల్లెల్ని ఎవరైనా టచ్ చేయాలంటే... ముందు నన్ను టచ్ చేయాలి' అని అనసూయకు మరో డైలాగ్ చెప్పిన తర్వాత... 'నాకు కావాల్సింది కూడా అదే! టచ్ చేస్తా' అని ఆది అన్నారు. ప్రోమో చూస్తే... స్కిట్ ఫన్నీగా ఉండబోతుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ 'పుష్ప: ద రైజ్' సినిమాలోని 'శ్రీవల్లి...' పాటతో 'హైపర్' ఆది ఎంట్రీ ఇచ్చారు. మిగతా టీమ్  లీడర్స్ స్కిట్స్ చేసేటప్పుడు కూడా రోజా పంచ్ డైలాగ్స్ వేశారు.


ఓ వైపు 'జబర్దస్త్' కార్యక్రమంలో యాంక‌ర్‌గా చేస్తూనే... మరో వైపు సినిమాల్లో కీలక పాత్రల్లో అనసూయ నటిస్తున్నారు. అల్లు అర్జున్ 'పుష్ప', రవితేజ 'ఖిలాడి' సినిమాల్లో ఆమె కనిపించనున్నారు. మరి కొన్ని సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.


'జబర్దస్త్' ప్రోమో:


Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
Also Read: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!
Also Read: టాలీవుడ్‌లో విషాదం... ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీను వైట్లకు పితృవియోగం
Also Read: కావాలనే మమ్మల్ని పక్కన పెడుతున్నారా..? టికెట్ రేట్ ఇష్యూపై సురేష్ బాబు ఆవేదన..
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి