గంజాయి రవాణాకు అక్రమార్కులు కొత్త దారులు వెదుకుతున్నారు. ఇటీవల కరివేపాకు పేరుతో అమెజాన్ లో గంజాయి రవాణా చేసిన ఘటన వెలుగుచూసింది. తాజాగా షుగర్ వ్యాధి నివారణకు వాడే ఆయుర్వేద మెడిసిన్ అని అమెజాన్ లో గంజాయి రవాణా చేసేందుకు ప్రయత్నించారు. ఎస్ఈబీ అధికారులు ఈ సీక్రెట్ రవాణా గుట్టురట్టు చేసి నిందితులను అరెస్టు చేశారు. అమెజాన్ ద్వారా విశాఖ ఏజెన్సీ నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు గంజాయి రవాణా చేస్తున్న ఓ ముఠాను విశాఖ ఎస్‌ఈబీ అధికారులు అరెస్టు చేశారు. డయాబెటిస్ వ్యాధి నివారణకు వాడే ఆయుర్వేద మెడిసిన్‌లో ఉపయోగించే ఆకులు అని అమెజాన్ లో రవాణా చేస్తేందుకు యత్నించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు వెల్లడించారు.
Also Read: అమెజాన్ లో కరివేపాకు పేరుతో గంజాయి స్మగ్లింగ్ కేసు.. ఏడుగురు అరెస్టు
ఎనిమిది నెలలుగా అమెజాన్ లో రవాణా
గత ఎనిమిది నెలలుగా అమెజాన్ ఆన్ లైన్ సర్వీస్ ద్వారా సుమారుగా 900 కేజీల గంజాయి రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో విశాఖకు చెందిన ఐదుగురిని ఎస్‌ఈబీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అమెజాన్ ఆన్‌లైన్ యాప్ ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారని మధ్యప్రదేశ్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఈనెల 21న కంచరపాలెంకు చెందిన చిలకపాటి శ్రీనివాసరావు ఇంటిలో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేశారు. నిందితుడి ఇంటిలో 48 కేజీల గంజాయితో పాటు ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్, గంజాయి ప్యాకెట్లు పార్శిల్ చేసేందుకు వాడే వస్తువులు లభించాయని అధికారులు తెలిపారు. దీంతో నిందితుడు శ్రీనివాసరావుని అరెస్టు చేసి విచారించారు. మధ్యప్రదేశ్ కు చెందిన సురజ్ పావయ్య, ముకుల్ జైశ్వాల్ సూపర్ నేచురల్ స్టేవియా లీవ్స్ పేరిట అమెజాన్ లో గంజాయి బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చిలకపాటి శ్రీనివాసరావు కుమారుడు చిలకపాటి మోహన్‌రాజు, అమెజాన్ పికప్ బాయ్స్ కుమారస్వామి, కృష్ణంరాజు, డ్రైవర్ వెంకటేశ్వర్లును ఎస్ఈబీ అరెస్టు చేసింది.
Also Read: Vishaka: మీ కరివేపాకు ఐడియాలకు దణ్ణంరా బాబు.. అమెజాన్ లో విశాఖ టూ మధ్యప్రదేశ్ కు గంజాయి సరఫరా
Also Read:Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...