కాన్పూర్‌ టెస్టులో టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది! న్యూజిలాండ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. షాట్ల ఎంపిక, నిర్ణయాల్లో బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. దాంతో నాలుగో రోజు, భోజన విరామానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. శతక వీరుడు శ్రేయస్‌ అయ్యర్‌ (18 బ్యాటింగ్‌; 51 బంతుల్లో 3x4), రవిచంద్రన్‌ అశ్విన్‌ (20 బ్యాటింగ్‌; 35 బంతుల్లో 3x4) కీలకంగా ఆడుతున్నారు.


ఓవర్‌ నైట్‌ స్కోరు 14/1తో టీమ్‌ఇండియా ఆదివారం ఆట మొదలు పెట్టింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (17; 53 బంతుల్లో 3x4), నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా (22; 33 బంతుల్లో 3x4) సానుకూల దృక్పథంతో ఆడారు. తొలి అర్ధగంట వరకు వీరిద్దరూ నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం అందించారు.


కుదురుకున్న ఈ జోడీని పుజారాను ఔట్‌ చేయడం ద్వారా జేమీసన్‌ విడదీశాడు. అప్పటికి స్కోరు 32. మరికాసేపటికే అజాజ్‌ పటేల్‌ వేసిన బంతిని క్రీజులోంచి ఆడి అజింక్య రహానె (4; 15 బంతుల్లో 1x4) వెనుదిరిగాడు. ఇక జట్టు స్కోరు 51 వద్ద ఓకే ఓవర్లో మయాంక్‌ అగర్వాల్‌, రవీంద్ర జడేజా (0)ను టిమ్ సౌథీ పెవిలియన్‌ పంపించాడు. దాంతో టీమ్‌ఇండియా 51/5తో కష్టాల్లో పడింది. శ్రేయస్‌, అశ్విన్‌ 74 బంతుల్లో 33 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ నిర్మించే పనిలో ఉన్నారు.






Also Read: Watch Video: అశ్విన్‌కు ఎడ్జ్‌ చేయడం నేర్పించిన అక్షర్‌..!


Also Read: IND vs NZ Kanpur Test: యాష్‌ నువ్వే భేష్‌..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ


Also Read: Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్‌ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్‌


Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్‌ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?


Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్‌ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్‌ ప్లేయర్‌


Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి