బరువు పెరగడం వల్లే పొట్ట వస్తుందని చాలామంది భావిస్తారు. అయితే, బరువు పెరిగే ప్రతి ఒక్కరికీ పొట్ట రాదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. పెరిగే బరువులో పొట్ట భారం కూడా ఉంటుంది. అయితే, పొట్ట పెరగడానికి మాత్రం.. మీరు చేసే చిన్న చిన్న తప్పిదాలే కారణం. ఎందుకంటే.. బరువు లేదా ఊబకాయం లేని వ్యక్తులకు కూడా పొట్ట బయటకు తన్నుకు వస్తూ ఉంటుంది. దాన్ని చూసి.. అయ్యో బొజ్జ వచ్చేస్తుంది తగ్గించుకోవాలని అనుకుంటారు. ఇందుకు ఎన్నో కసరత్తులు కూడా చేస్తారు. అయితే, ఈ బొజ్జ చాలా కారణాల వల్ల ఏర్పడుతుంది. ఒకటి గ్యాస్ లేదా గాలి వల్ల కావచ్చు. రెండోది మనం తినే ఆహారం వల్ల కావచ్చు. మూడోది.. పొట్ట వద్ద పేరుకుపోయే కొవ్వుల వల్ల కూడా కావచ్చు.
చిన్న చిన్న పొరపాట్లు.. పెద్ద పెద్ద పొట్టలు:
హడావిడిగా తినడం: మీరు ఆహారం తినే విధానం వల్ల కూడా మీకు బొజ్జ పెరగవచ్చు. కొంతమంది ఎవరో తరుముతున్నట్లుగా గాబరాగా తినేస్తుంటారు. అలా చేయడం వల్ల గాలిని మింగేస్తారని యూకేకు చెందిన క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సూజీ సయార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వేగంగా తిన్నప్పుడు ఆహారంతోపాటు గాలి కూడా నోట్లోకి వెళ్లిపోతుంది. అయితే, అది ఊపిరితీత్తుల్లోకి వెళ్లకుండా అన్నవాహికలో తిష్ట వేస్తుంది. అది పెద్ద ప్రేగుల్లోకి చేరి కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. అందుకే, కొందరికి తిన్న తర్వాత పొట్ట తన్నుకుని వస్తుంది. అయితే, ఇది తాత్కాలికమే. కానీ, రోజూ అదే వేగంతో తింటే.. ఆ పొట్ట అలాగే ఉండిపోతుంది. కాబట్టి.. ఆహారాన్ని నిదానంగా తినాలి. వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. టీవీ చూస్తూ పరధ్యానంతో తినకుండా.. నెమ్మదిగా నములుతూ రుచిని ఆస్వాదించాలి. ఆహారాన్ని మింగడానికి ముందు కనీసం 30 సార్లు నోటిలో నమాలి.
కార్బొనేటెడ్ డ్రింక్స్: మీరు తాగే శీతల పానీయాలు కూడా మీ బొజ్జను పెంచేస్తాయి. గ్యాస్ సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా కార్బోనేటేడ్ డ్రింక్స్‌లో కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది. వాటిలో ఉండే గ్యాస్ మీ కడుపును బయటకు తన్నుకొచ్చేలా చేస్తుంది. డైట్ డ్రింక్స్‌లో ఉండే ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు ఈ సమస్యను మరింత పెంచుతాయి. ఎందుకంటే అవి జీర్ణం కావడం చాలా కష్టం. బొజ్జ లేదా గ్యాస్ సమస్యల వల్ల పొట్టు ఉబ్బితే.. నీళ్లు మాత్రమే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు బయటకు వెళ్లినప్పుడు.. మీ పొట్ట కూడా బయటకు తన్నుకు రాకుండా ఉండాలంటే కూల్ డ్రింక్స్, బీర్, పళ్ల రసాలను తీసుకోడానికి బదులుగా.. వైన్ తాగవచ్చని తెలుపుతున్నారు. వైన్‌లో పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెంచే, ఉబ్బరాన్ని తగ్గించే సమ్మేళనాలు ఉంటాయట.
పీరియడ్స్ వల్ల కూడా..: చాలామంది మహిళలకు పీరియడ్స్ ప్రారంభానికి ముందు కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. పీరియడ్స్ వల్ల రక్తస్రావంతో పాటు, ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలలో ఏర్పడే మార్పుల వల్ల శరీరంలో మరింత నీరు, ఉప్పు నిల్వ ఉంటుంది. ఫలితంగా, శరీరంలోని కణాలు నీటిలో ఉబ్బిన అనుభూతిని కలిగిస్తాయి. ఉప్పగా ఉండే ఆహారం, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లు(పిండి, ప్రాసెస్ చేసిన చక్కెర) నివారించడం ద్వారా దీన్ని నివారించవచ్చు. బచ్చలి కూర, చిలకడ దుంప, అరటిపండ్లు, అవకాడోలు, టొమాటోలు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
లాక్టోజ్ జీర్ణం కాకపోయినా..: కొంతమందిలో ఆవు పాలలోని చక్కెర, లాక్టోస్‌ను జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్ ఉండదు. ఫలితంగా పెద్దప్రేగులో లాక్టోస్ పులియబెట్టినట్లు అవుతుంది. ఇది పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల పొత్తికడుపులో గ్యాస్ ఏర్పడతుంది. కొద్ది రోజులు పాల ఉత్పత్తులను తగ్గించండి. వాటికి ప్రత్యామ్నాయ ఆహారాన్ని తీసుకోండి.
మలబద్ధకం: పెద్ద పేగులో మలం ఎక్కువసేపు ఉంటుంది. అది ఎక్కువ గ్యాస్, ఉబ్బరాన్ని కలిగిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. ఫైబర్ వల్ల ఆహారం ఎక్కువ సేపు పెద్ద పేగులో నిల్వ ఉండదు. విసర్జనను సులభతరం చేస్తుంది. ఎక్కువ నీరు తాగడం, వ్యాయామం చేయడం వల్ల పేగులు కదులుతాయి. దీనివల్ల గ్యాస్ ఏర్పడదు.
Also Read: కోవిడ్-19 కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’.. ఇది డేల్టా కంటే డేంజరా? లక్షణాలేమిటీ?
ఫొడ్‌మ్యాప్ (FODMAP) ఆహారాలను తీసుకోండి: ఫొడ్‌మ్యాప్ ఆహారాలను తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం, పొట్ట తన్నుకు వచ్చే సమస్యల నుంచి బయటపడొచ్చు. ఉల్లి, వెల్లుల్లి తీసుకోవడం మంచిది. ఆహారం జీర్ణం కావడానికి కనీసం 30 నిమిషాలు అటూ ఇటూ తిరగండి. కడుపు ఉబ్బినట్లయితే.. చేతితో ఎడమ నుంచి కుడికి వృత్తాకారంలో తిప్పుతూ మసాజ్ చేయండి. పుదీనా టీ కూడా మేలు చేస్తుంది. అధిక ఫ్రక్టోజ్ ఆహారాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలికంగా బొజ్జ సమస్యతో బాధపడేవారైతే యోగా, వ్యాయామాలు చేస్తేనే ఫలితం ఉంటుంది.
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి