గంజాయి రవాణాలో కొత్తకొత్త దారులను వాడుకుంటున్నారు. కొత్తగా ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. గంజాయి రవాణాకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ను వాడుకున్నట్టు తెలిసింది. మరో విషయం ఏంటంటే.. టన్ను గంజాయిని అలా తరలించారని తేలింది. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే.. గంజాయితో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్ లో పోలీసులు విచారించారు. అప్పుడు ఈ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఒకటి రెండు రోజులుగా కాదు.. ఏపీలోని విశాఖ నుంచి నాలుగు నెలలుగా.. ఈ గుట్టు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ మాటలు విని పోలీసులు.. ఆశ్చర్యపోయారు.
మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లా పోలీసులు సూరజ్ అలియాస్ కల్లూ పావవియా, పింటూ అలియాస్ బిజేంద్ర సింగ్ తోమర్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు విచారించారు. నాలుగు నెలలుగా అమెజాన్ లో గంజాయిని తరలిస్తున్నట్టు వారు పోలీసులకు తెలిపారు. సుమారు రూ.1.10 కోట్ల విలువైన గంజాయిని తరలించినట్లు చెప్పారు. నిందితుల్లో ఒకరైన సూరజ్ హెర్బల్ ప్రోడక్ట్స్, కరివేపాకు విక్రేతగా అమెజాన్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత.. ఇక తన పని మెుదలు పెట్టాడు. గంజాయిని తరలిస్తూ.. మధ్యప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, రాజస్థాన్ కూడా తరలిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.
అయితే పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అమెజాన్ కు మధ్యప్రదేశ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. మరో విషయం ఏంటంటే.. ఇంత జరుగుతున్నా.. అమెజాన్ ఈ విషయాన్ని గుర్తించలేదని తేలింది. ఈ వ్యవహారంలో లాజిస్టిక్ సదుపాయంతో పాటు డెలివరీ సదుపాయం సైతం అమెజాన్ ఇచ్చిందని.. కానీ ఎక్కడా దీన్ని కంపెనీ గుర్తించలేకపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా స్పందించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తామని చెప్పింది. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను తమ సంస్థలో విక్రయించడం లేదని అంటోంది. ఈ కేసు ఎక్కడకు వరకూ వెళ్తుందనేది చూడాలి.
‘
Also Read: Rachakonda Police: హైదరాబాద్‌లో మళ్లీ గంజాయి రాకెట్.. 1,240 కిలోలు స్వాధీనం, మూలం ఎక్కడంటే..
Also Read: Andhra Sameer Wankhede : ఆంధ్రాపై గురి పెట్టిన సమీర్ వాంఖడే ! ఈ సారి ఏం పట్టుకున్నారో తెలుసా ?