సమీర్ వాంఖడే. ఈ పేరు గురించి అందరికీ తెలుసు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడ్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం దగ్గర్నుంచి ఆ తర్వాత పరిణామాలు హై ఎండ్ ధ్రిల్లర్‌ను తలపించాయి. ఇప్పుడు వాంఖడేకు బదులుగా ఓ టీం ఆ కేసు దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు వాంఖడే మరోసారి పంజా విసిరారు. ఆయన ఏకంగా 1127 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ముంబైకి అత్యంత సీక్రెట్‌గా రవాణా అవుతున్న గంజాయిని వెంబడించి పట్టుకున్నారు. ముంబై నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరక్టర్‌గా ఉన్న వాంఖడే డ్రగ్స్‌పై పోరాటంలో ఎంత దూరం అయినా వెళ్తారన్న పేరుంది.
విశాఖ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న స్పష్టమైన సమాచారం అందడంతో ఎన్సీబీ బృందం నిగా పెట్టింది. నాందేడ్ జిల్లాలో లారీ లో తరలిస్తున్న 1,127 కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.5.63 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మత్తుపదార్థాలను తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి గంజాయి తరలిస్తుండగా రైడ్ చేసి పట్టుకున్నట్లు అధికారులు ప్రకటించారు. వారిద్దరూ తెలుగు వారే.
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
ఏపీలో ఇటీవల గంజాయి అంశంపై రాజకీయ దుమారం రేగింది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నామని .. చెకింగ్స్ భారీగా చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ఏపీలో ఎంత పట్టుబడుతున్నాయో కానీ బయట రాష్ట్రాల్లో మాత్రం ఏపీ నుంచి వెళ్లేవి పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నాయి.
Also Read : వీడియో కాల్‌లో సెక్స్ చాట్ చేస్తున్నారా? అయితే మీ ఖాతాలో డబ్బులు ఖతమ్
Also Read: వార్నీ.. దేవుడి కాళ్లకు మొక్కి మరీ గుడిలో హుండీని ఎత్తుపోయాడు, వీడియో వైరల్