ఓ దొంగ గుడిలోని హుండీని కొట్టేయాలని అనుకున్నాడు. అటు ఇటూ చూశాడు. కాసేపు ఫోన్ చూస్తున్నట్లు నటించాడు. ఎవరూ తనని చూడటం లేదని నిర్ధరించుకున్న తర్వాత దేవుడి విగ్రహం వద్దకు వెళ్లాడు. అనంతరం అక్కడ ఉన్న హుండిని పట్టుకుని పారిపోయాడు. ఇందులో చిత్రం ఏమిటంటే.. అతడు ఆ దొంగతనం చేసే ముందు ఆ దేవుడి కాళ్లకు దన్నం పెట్టి మరీ హుండీని ఎత్తుకుపోయాడు.


ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. థానేలోని హనుమంతుడి గుడిలోకి ప్రవేశించిన దొంగ.. కాసేపు అటూ ఇటూ చూశాడు. ఎవరూ గమనించడం లేదని తెలుసుకున్న తర్వాత.. హనుమంతుడి విగ్రహం పాదాలకు మొక్కాడు. ఆ తర్వాత విగ్రహం ఎదురుగా ఉన్న హుండీని ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. సీసీటీవీ ఫూటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హుండీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోను మీరు ఇక్కడ చూసేయండి.


వీడియో:



2019లో హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్‌లోని గన్‌ఫండ్రీ ప్రాంతంలోని దుర్గాభవానీ ఆలయంలో విగ్రహం కిరీటాన్ని దొంగిలించే ముందు ఓ దొంగ దుర్గాదేవికి క్షమాపణలు చెప్పాడు. గుడిలో ఉన్న సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో ఒక వ్యక్తి తన పాదరక్షలను తీసివేసి ఆలయంలోకి ప్రవేశించడం కనిపించింది. అనంతరం అతడు చేతులు జోడించి ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారికి దన్నం పెట్టుకున్నాడు. అనంతరం విగ్రహం పాదాలకు మొక్కాడు. ఆ తర్వాత అతను తన చెవులు పట్టుకుని.. అమ్మవారిని క్షమాపణలు కోరాడు. నుదుటికి తిలకం కూడా పెట్టుకున్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత వ్యక్తి విగ్రహం నుంచి కిరీటాన్ని దొంగిలించాడు. అనంతరం మళ్లీ దేవుడికి దన్నం పెట్టాడు. అమ్మవారి కిరీటాన్ని తన దుస్తుల్లో దాచుకుని అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు.  


Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? ‘హ్యూమాన్జీ’ ఏమైంది?


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి