దిల్లీలోని దర్బార్‌ హాల్‌లో జాతీయ క్రీడా పురస్కారాల వేడుక ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు. మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాన్ని 12 మందికి అందజేశారు. అథ్లెట్లలో దర్బార్‌ హాల్‌లో సందడి నెలకొంది. ఖేల్‌రత్నతో పాటు అర్జున పురస్కారాలనూ రాష్ట్రపతి అందించారు.






ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌కు వందేళ్లలో తొలి స్వర్ణం అందించిన జావెలిన్‌ త్రో ఆటగాడు నీరజ్‌ చోప్రాకు మొదట రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఖేల్‌రత్న పురస్కారాన్ని అందజేశారు. అతడిని ప్రత్యేకంగా అభినందించారు. పారా బ్యాడ్మింటన్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌, క్రికెటర్‌ మిథాలీ రాజ్‌, ఫుట్‌బాలర్‌ సునిల్‌ ఛెత్రీ, హాకీ ఆటగాడు మన్‌ప్రీత్‌ సింగ్‌ ఖేల్‌రత్న పురస్కారాలను అందుకున్నారు.






బాక్సర్‌ లవ్లీనా బొర్గెహెయిన్‌, హాకీ గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ పీఆర్, పారా అథ్లెట్‌ సుమిత్‌ అంటిల్‌, పారా షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌, పారా షూటర్‌ మనీశ్‌ నర్వాల్‌, హాకీ కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు రాష్ట్రపతి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేశారు. క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌, హాకీ అమ్మాయిలు వందనా కటారియా, మోనికా, కబడ్డీ క్రీడాకారులు సందీప్‌ నర్వాల్‌, షూటర్‌ అభిషేక్ శర్మకు అర్జున పురస్కారాలు అందించారు. 






Also Read: India Tests Squad Against NZ: టీమ్‌ఇండియాలోకి విశాఖ కుర్రాడు.. కివీస్‌ టెస్టు సిరీసుకు భారత జట్టిదే


 Also Read: T20 WC 2021: 4 జట్లతో ఆడుకున్న '6' సెంటిమెంట్‌..! ముందు విజయం సెమీస్‌లో పరాభవం..!


Also Read: Hasan Ali Troll: హసన్‌ అలీకి అండగా భారతీయులు.. పాక్‌ పేసర్‌కు మద్దతుగా #INDwithHasanAli ట్రెండింగ్‌


Also Read: AUS Vs NZ: కేన్ మామ వర్సెస్ డేవిడ్ భాయ్.. అరెరే.. పెద్ద సమస్యే వచ్చి పడిందే!


Also Read: CK Nayudu: 50 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ.. 62 ఏళ్లప్పుడు చివరి మ్యాచ్, క్రికెట్ చరిత్రలో సీకే నాయుడు ఒక శిఖరం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి