నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా 'ఆహా'లో 'Unstoppable' అనే షో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. తొలిసారి బాలయ్య హోస్ట్ చేస్తోన్న షో కావడంతో దీనిపై జనాల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ షో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. దీపావళి కానుకగా తొలి ఎపిసోడ్ ను ప్రసారం చేశారు. ఈ ఎపిసోడ్ కి మోహన్ బాబుని గెస్ట్ గా తీసుకురాగా.. మంచి వ్యూస్ వచ్చాయి. రెండో గెస్ట్ గా నేచురల్ స్టార్ నానిని తీసుకొచ్చారు. ఈ ఎపిసోడ్ కూడా అభిమానులను ఆకర్షిస్తోంది. బాలయ్య-నానిల మధ్య సంభాషణ ఆకట్టుకుంటుంది. 


Also Read:అమెరికాలో విజయ్ దేవరకొండ.. పూరితో చిల్ అవుతూ..


నాని కొన్ని ఆసక్తికర విషయాలను ఈ షోలో బాలయ్యతో పంచుకున్నారు. అలానే బాలయ్యతో కలిసి హాలీవుడ్ 'గాడ్ ఫాదర్' లాంటి సినిమాలో నటించాలనుందని అన్నారు. తన తాగుడు అలవాట్ల గురించి నాని ఓపెన్ గా కామెంట్స్ చేశారు. తను సోషల్ డ్రింకర్ అని, రెడ్ వైన్ తాగుతుంటానని చెప్పారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షో వల్ల 'ఆహా'కి సబ్‌స్క్రైబర్లు ఓ రేంజ్ లో పెరిగారు. 


మొదటి సీజన్ మొత్తం ఇలా క్రేజీ గెస్ట్ లతో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం.. మూడో ఎపిసోడ్ కి కూడా ఓ స్పెషల్ గెస్ట్ ను తీసుకురాబోతున్నారు. ఆయనెవరో తెలుసా.. మన యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఈ రౌడీ హీరోకి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అల్లు అరవింద్ తన షోలో విజయ్ ని గెస్ట్ గా పిలిచారు. 'Unstoppable' మూడో ఎపిసోడ్ లో బాలయ్యతో విజయ్ సందడి చేయబోతున్నాడు. 


బాలయ్యకి విజయ్ కి మధ్య మంచి అనుబంధమే ఉంది. మొన్నామధ్య పూరి జగన్నాథ్ కోసం 'లైగర్' సినిమా సెట్స్ కి వెళ్లిన బాలయ్య.. విజయ్ ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఇక విజయ్ ఏ షోలో పాల్గొన్నా.. కూడా అక్కడి వాతావరణాన్ని ఫుల్ జోష్ తో నింపేస్తాడు. తనదైన స్టయిల్ లో ముచ్చట్లు పెడుతూ.. తన యూనిక్ నెస్ తో ఆకట్టుకుంటాడు. అలాంటి వ్యక్తి బాలయ్య షోలో పాల్గొంటే రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. కొద్దిరోజుల్లో ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి.. ప్రోమోను విడుదల చేయబోతున్నారు. 


Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్


Also Read: వీవీ వినాయక్ క్లాప్‌తో...  బాలకృష్ణ107వ సినిమా షురూ


Also Read: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!


Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం... బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చిన నాని


Also Read: పవన్ కల్యాణ్ చూశారు... ప్రశంసించారు! సంతోషంలో సినిమాటోగ్రాఫర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి