స్టార్ మా 'బిగ్ బాస్' సీజన్ 5, ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా 'బిగ్‌ బాస్‌ ఈజ్‌ వాచింగ్‌ యు' (బిగ్‌బాస్‌ మిమ్మల్ని చూస్తున్నాడు) ఈ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించాయి. ప్రజల అవగాహన నిమిత్తం దీనిని రూపొందించినట్టు తెలిపాయి. 'బిగ్ బాస్' సీజన్ జరిగిన వంద రోజులూ ఈ క్యాంపెయిన్ కొనసాగుతోంది. ఇందులో భద్రతా ప్రమాణాలు, మెట్రో నిబంధనలు,  ప్రయాణికులు తమ సౌకర్యం కోసం సరైన విధానంలో మెట్రోని మరింతగా వినియోగించడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించడం వంటివి తెలుపనున్నారు.
"బిగ్‌ బాస్‌ పూర్తిగా వినోదాత్మక కార్యక్రమం. వీక్షకుల్లో భావోద్వేగాలను తట్టి లేపుతుంది. ఈ ప్రచారం ద్వారా  భద్రత పట్ల మరింత అవగాహన సృష్టించే ప్రయత్నమూ చేస్తున్నారు. స్టార్‌ మా, ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఈ తరహా సృజనాత్మక, సామాజికంగా బాధ్యతాయుతమైన ప్రచారం చేయడానికి ముందుకు రావడం సంతోషంగా ఉంది" అని హీరో, బిగ్‌బాస్‌ హోస్ట్‌ అక్కినేని నాగార్జున అన్నారు. "హైదరాబాద్‌ నగరంలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం హైదరాబాద్‌ మెట్రో రైల్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేం చాలా ఆనందంగా ఉన్నాం" అని స్టార్‌ మా  అధికార ప్రతినిధి అన్నారు.
" 2019లో 'బిగ్‌ బాస్‌' సీజన్‌3తో మేం స్టార్‌ మాతో అసోసియేట్ అయ్యాం. మరోసారి స్టార్‌ మా, 'బిగ్‌ బాస్‌' సీజన్‌5తో అసోసియేట్ కావడం పట్ల సంతోషంగా ఉన్నాం. 'బిగ్‌ బాస్‌ ఈజ్‌ వాచింగ్‌ యు' క్యాంపెయిన్ ద్వారా కొవిడ్‌ కారణంగా అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు, సురక్షిత ప్రయాణ పద్ధతులు వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం" అని ఎండీ & సీఈవొ, ఎల్‌ & టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ కెవీబీ రెడ్డి అన్నారు.

Also Read: కండోమ్ టెస్ట‌ర్‌గా ర‌కుల్... కండోమ్‌తో ఆమె లుక్ చూశారా?
Also Read: అమెరికాలో విజయ్ దేవరకొండ.. పూరితో చిల్ అవుతూ..
Also Read: జబర్దస్త్' షో వదిలేస్తున్న స్టార్ కమెడియన్..?
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
Also Read: వీవీ వినాయక్ క్లాప్‌తో...  బాలకృష్ణ107వ సినిమా షురూ
Also Read: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం... బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: పవన్ కల్యాణ్ చూశారు... ప్రశంసించారు! సంతోషంలో సినిమాటోగ్రాఫర్
Also Read: నా మాటలు తప్పని నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కిస్తా.. విమర్శకులకు కంగనారనౌత్ ఆఫర్ !
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి