పాకిస్థాన్‌ పేసర్‌ హసన్‌ అలీకి భారతీయులు అండగా నిలిచారు. సెమీస్‌లో ఓటమికి అతడినెందుకు బాధ్యుడిని చేస్తున్నారని ప్రశ్నించారు. మాథ్యూవేడ్‌ క్యాచ్‌ అందుకొనేందుకు అతడు శక్తికి మించి ప్రయత్నించాడని అంటున్నారు. కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ సైతం ఆ క్యాచే ఓటమి పాలు చేసిందని చెప్పడం బాధాకరమని అంటున్నారు. ప్రస్తుతం ట్విటర్లో #INDwithHasanAli అనే  హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.


టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచులో మహ్మద్‌ షమీపై ఆన్‌లైన్‌ దాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడే పాకిస్థాన్‌ ఆటగాళ్లు అతడిని గౌరవించాలని చెప్పారు. కాగా ఆ దాడి పాక్‌ కేంద్రంగానే జరిగిందని తర్వాత తెలిసింది! ఇక దుబాయ్‌ వేదికగా పాకిస్థాన్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఢీకొంది. ఛేదనలో ఆసీస్‌ 10 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన తరుణంలో షాహిన్‌ అఫ్రిది వేసిన బంతికి వేడ్‌ గాల్లోకి ఆడాడు. దానిని పట్టుకొనేందుకు హసన్‌అలీ శక్తికి మించి ప్రయత్నించాడు. కానీ ఆ బంతి నేలపాలైంది. వెంటనే వేడ్‌ వరుసగా మూడు సిక్సర్లు బాదేసి జట్టును గెలిపించాడు.






మ్యాచ్‌ ముగిసిన వెంటనే హసన్‌ అలీపై విమర్శలు మొదలయ్యాయి. ట్విటర్‌ వేదికగా పాక్‌ అభిమానులు అతడిని దూషించారు. అతడు భారత్‌ వైపు ఉన్నాడని, షియా వర్గానికి చెందినవాడని, అతడి భార్య భారత అమ్మాయి అని దూషణలు మొదలుపెట్టారు. కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ సైతం అతడు క్యాచ్‌ జారవిడవడం వల్లే మ్యాచ్‌ ఓడిపోయామని చెప్పాడు. దాంతో భారతీయులు హసన్‌కు అండగా నిలిచారు. భారత్‌ హసన్‌ అలీతో ఉందని హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. జట్టులోని ఆటగాడికి అండగా ఉండలేదని ఆజామ్‌ పైన విమర్శలు మొదలు పెట్టారు. దాంతో అతడూ తర్వాత వివరణ ఇచ్చాడు. కొన్నిసార్లు క్యాచులు జారిపోతాయని, అతడికి తామంతా అండగా ఉంటామని అన్నాడు.






Also Read: T20 World Cup: మనోళ్లు ఐపీఎల్‌ను తిడుతుంటే..! కేన్‌ మామ మాత్రం ఐపీఎల్‌ వల్లే సెమీస్‌ చేరామన్నాడు!


Also Read: Watch Video: పాకిస్తాన్ ఓటమిని జీర్ణించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చిన బాలుడు.. వీడియో షేర్ చేసిన అక్తర్ 


Also Read: PAK vs AUS, Match Highlights: ఈసారి కొత్త విజేత ఖాయం.. పాక్‌ను చిత్తు చేసి ఫైనల్స్‌కు చేరిన ఆస్ట్రేలియా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి