Dr Madhavi Latha | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా  హాట్ టాపిక్ గా మారిన  ఛీనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం లో మన తెలుగు మహిళా ఇంజనీర్ పాత్ర  ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కాశ్మీర్ లోని  చీనాబ్ నదిపై  359 మీటర్ల ఎత్తులో  నిర్మించిన చీణాబ్ రైలు వంతెన  ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ కన్నా  35 మీటర్ల ఎత్తు లో ఉంది.  ఈ రైల్వే బ్రిడ్జిని ఇటీవలే  ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రారంభం కావడంతో  జమ్ము - శ్రీనగర్ల మధ్య రైల్వే లింక్ ఏర్పడింది. మనదేశంలోని ఏ రాష్ట్రం నుంచి అయినా డైరెక్ట్ గా శ్రీనగర్ కి ఇప్పుడు  ట్రైన్ ద్వారా వెళ్లే అవకాశం వచ్చేసింది. కాశ్మీర్ డెవలప్మెంట్ లో ఇది ఒక కీలక మలుపుగా  నిపుణులు చెబుతున్నారు . అయితే ఇంత అద్భుతమైన నిర్మాణం వెనక  ఒక మహిళా ఇంజనీర్ పాత్ర ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  గత 17 ఏళ్లుగా ఆమెఈ ప్రాజెక్టుకి అంకితమై పని చేశారు.  ఆమె పేరు డాక్టర్ గాలి మాధవి లత.

Continues below advertisement


ఒకే ప్రాజెక్ట్ కోసం 17 ఏళ్ళు అంకితమై...


 మహిళా ఇంజనీర్ మాధవి లత  సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మద్రాస్ ఐఐటీ నుండి  పీహెచ్డీ చేశారు  2003 లో బెంగుళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్  సైన్స్ (IIS ) లో  జియో టెక్నికల్ ఇంజనీరింగ్  ప్రొఫెసర్ గా చేరి రెండేళ్లు పని చేసారు.  ఆ తర్వాత ప్రతిష్టాత్మక చినాబ్ రైల్వే ప్రాజెక్ట్ లో చేరి  17 ఏళ్ల పాటు  దానికే అంకితమై పని చేశారు.  ఈ ప్రాజెక్టుకి కన్సల్టెంట్ గా  అమూల్యమైన సలహాలు అందించి చాలా కీలకంగా మారారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్  ఆఫకోన్స్  (AFCONs ) సంస్థ కోరిక మేరకు ఈ ప్రాజెక్టులో చేరిన ఆమె ముందుగా  తన కో కాన్సల్టెంట్ గా మరొక వ్యక్తిని నియమించుకున్నారు. కానీ అత్యంత ఎత్తైన కొండల నడుమ, విపరీతమైన వేగంతో వీచే గాలులను తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండడంతో  ఈ పని తన వల్ల కాదు అంటూ అతను తప్పుకున్నాడు.


అయినప్పటికీ మాధవి లత  ఏ మాత్రం వెనుకంజు వేయకుండా  బ్రిడ్జ్ వాలు స్థిరీకరణ (SLOPE ), పునాది బలోపేతం వంటి ముఖ్యమైన అంశాల్లో కీలకంగా పనిచేశారు. 17 ఏళ్ల పాటు ఇదే పనిలో ఉన్న ఆమె  పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. 1400 కోట్లకు పైగా ఖర్చుతో  మించిన ఈ ప్రతిష్టాత్మక చినాబ్ రైల్వే బ్రిడ్జి  జూన్ 6న ప్రధాని మోదీ ప్రారంభించారు.