తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో  నల్లమల్ల రామారెడ్డి జిల్లా పరిషత్  హై స్కూల్ పూర్వ విద్యార్థులు సమావేశంలో అశ్లీల నృత్యాలు కలకలం రేపుతున్నాయి. కార్తీక వనభోజనాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు, జాతర్లు పేరు ఏదైనా  రాజకీయ అండ, పోలీసులు దన్ను ఉండడంతో అశ్లీల ప్రదర్శనలు సర్వ సాధారణమైపోయింది. అనపర్తిలోని నల్లమిల్లి రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ చెందిన 1996-97 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. నల్లమిల్లి రామారెడ్డి(నేషనల్) తోటలో అశ్లీల ప్రదర్శనలు నిర్వహించడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు..  ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇదే ప్రదర్శనలు ఎవరైనా సామాన్యులు చేస్తే వారిపై విరుచుకు పడే పోలీసుల తీరును పలువురు విమర్శించారు. 


Also Read:  రేపు టీఆర్ఎస్ఎల్పీ కీలక భేటీ.. ఢిల్లీలో దీక్షపై చర్చించే అవకాశం


పూర్వ విద్యార్థులూ ఇదేంపని


కార్తీక మాసంలో చాలా మంది వనభోజనాలు వెళ్తుంటారు. ఈ భోజనాలకు వెళ్లి సరదాగా ఆటలాడుతూ ఉత్సాహంగా గడుపుతుంటారు. కొందరు అటవీ ప్రాంతాల్లో, బీచ్ లు, ఆలయాల వద్దకు  వనభోజనాలకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుంటారు. కార్తీక మాసం వచ్చిందంటే వనభోజనాలకు వెళ్లి ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతుంటారు. ఏపీలో ఓ హైస్కూల్‌ పూర్వ విద్యార్థులు వనభోజనాలకు వెళ్లి అక్కడ అశ్లీల నృత్యాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కార్తీక వనభోజనాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు, జాతర్లు పేరు ఏదైనా రాజకీయ అండ ఉంటే అశ్లీల ప్రదర్శనలు నడిచిపోతున్నాయి. 


Also Read: హైదరాబాద్‌లో మళ్లీ గంజాయి రాకెట్.. 1,240 కిలోలు స్వాధీనం, మూలం ఎక్కడంటే..


పోలీసులు తీరుపై విమర్శలు


తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నల్లమిల్లి రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ చెందిన 1996- 97 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు కార్తీక వనభోజనాలు ఏర్పాటుచేసుకున్నారు. ఆదివారం నల్లమిల్లి రామారెడ్డి(నేషనల్) తోటలో అశ్లీల ప్రదర్శనలు నిర్వహించడం, వనభోజనాలకు వచ్చిన పెద్దలను, సిగ్గుపడేలా చేసింది. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు లేకుండా ఉదాసీనంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనలు ఎవరైనా సామాన్యులు చేస్తే వారిపై విరుచుకు పడే పోలీసులు ఇప్పుడు స్పందించకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. సరదాగా ఉత్సాహంగా గడిపే వన భోజన కార్యక్రమంలో ఇలాంటి దృశ్యాలను చూసిన స్థానికులు నోరెళ్లబెట్టారు. పూర్వ విద్యార్థులు ఇలాంటి నృత్యాలు చేస్తుండటంపై మండిపడుతున్నారు. 


Also Read: మీ కరివేపాకు ఐడియాలకు దణ్ణంరా బాబు.. అమెజాన్ లో విశాఖ టూ మధ్యప్రదేశ్ కు గంజాయి సరఫరా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి