రేపు టీఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం 4 గంటలకు శాసనసభ పక్షం భేటీ అవుతుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సమావేశంలో చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఒక తీరు, రాష్ట్ర బీజేపీ మరో విధంగా వ్యవహరిస్తుందని.. దీనితో రైతులు అయోమయానికి గురవుతున్నారని.. టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈనెల 12న నియోజవర్గాల వారీగా ధర్నాలు కూడా నిర్వహించింది.


కేంద్రం స్పష్టతనిచ్చే వరకూ ఆందోళనలు కొనసాగుతాయని.. టీఆర్ఎస్ తెలిపింది. దానిపై టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో భవిష్యత్ కార్యచరణను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీలో రైతు దీక్ష లేదా ధర్నా చేపట్టాలని టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో చర్చ జరగనుంది. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించేందుకు ప్రణాళికలు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం.., బీజేపీ వైఖరితోపాటు ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టే అంశాలపైనా..  ఢిల్లీ స్థాయిలో.. ఆందోళన, ఏ రూపంలో కొనసాగించాలో చర్చ జరిగే అవకాశం ఉంది.


ఇప్పటికే.. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ 12న ధర్నా చేసింది.  జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతుతిచ్చారు. ధాన్యం కొనాల్సిన కేంద్రమే తాము కొనమని చెబితే.. రైతులు ఎక్కడికి పోవాలని.. పండించిన పంటనంతా ఏం చేయాలని మంత్రులు మోదీ సర్కార్​ను ప్రశ్నించారు. రైతులను కష్టపెట్టిన ఏ ప్రభుత్వం నిలబడినట్లు చరిత్రలో లేదని విమర్శించారు. దేశమంతా ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.


Also Read: Trs Vs Bjp: బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత... కాన్వాయ్ పై గుడ్లతో దాడి... బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల బాహాబాహీ


Also Read: Siddipet Collectior : సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా ... టీఆర్ఎస్‌ తరపున ఎమ్మెల్సీగా బరిలోకి దిగే చాన్స్ !


Also Read: Rachakonda Police: హైదరాబాద్‌లో మళ్లీ గంజాయి రాకెట్.. 1,240 కిలోలు స్వాధీనం, మూలం ఎక్కడంటే..


Also Read: Nalgonda: బండి సంజయ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తత.. చెప్పులు, గుడ్లు విసురుకున్న నేతలు


Also Read: Weather Updates: ఏపీకి రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇలా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి