కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ఇంటిపై దాడి జరిగింది. ఉత్తరాఖండ్‌ నైనిటాల్‌లోని సల్మాన్‌ ఖుర్షీద్‌ నివాసంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి నిప్పుపెట్టారు. అనంతరం రాళ్లు విసిరారు. అయోధ్యపై సల్మాన్‌ ఖుర్షీద్‌ రాసిన “సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్ హుడ్ ఇన్ అవర్ టైమ్స్”(Launch of Sunrise over Ayodhya) పుస్తకంపై వివాదం నడుస్తోంది. “ప్రస్తుతం ఉన్న హిందుత్వ భావజాలానికి గతంలో హిందుత్వానికి చాలా తేడాలున్నాయని సల్మాన్‌ ఖుర్షీద్‌ తన పుస్తకంలో రాశారు. ఐసీస్, బోకో హరామ్ వంటి ఇస్లామిక్ జిహాదీ గ్రూపులకు ప్రస్తుత హిందుత్వ గ్రూపులకు తేడా లేదని ఖుర్షీద్ తన పుస్తకంలో పేర్కొన్నారు. సల్మాన్ ఖుర్షీద్.. దాడి సంబంధించిన వీడియోలు, చిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టారు.



Also read: ఇతడు గజినీల సంఘానికే లీడర్... ఆరుగంటలకోసారి అంతా మర్చిపోతాడు, చివరికి కొడుకు పుట్టిన సంగతి కూడా...


పుస్తకాన్ని బ్యాన్ చేయాలి: ఎమ్మెల్యే రాజాసింగ్


సల్మాన్‌ ఖుర్షీద్‌ పుస్తకంపై బీజేపీ నేతలు, కొన్ని హిందుత్వ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పుస్తకం భారతదేశంలో మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని మండిపడుతున్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖుర్షీద్‌ను కాంగ్రెస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని బీజేపీ నేతలు అంటున్నారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఈ విషయంపై స్పందిస్తూ అయోధ్యపై సల్మాన్‌ ఖుర్షీద్‌ రాసిన పుస్తకాన్ని బ్యాన్‌ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. తన పుస్తకంలో ఎటువంటి తప్పులేదని మరోసారి సమర్ధించారు సల్మాన్‌ ఖుర్షీద్‌. ఇటీవల పరిస్థితులను తన పుస్తకంలో ప్రస్తావించినట్టు స్పష్టం చేశారు. 






Also Read: 'స్వతంత్ర భారతావనిలో గిరిజనులకు ఇంత గౌరవం దక్కడం ఇదే తొలిసారి'


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి