ABP  WhatsApp

International News: 'ఆవు.. మహిళ.. ఓ భర్త..' ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. ట్విస్ట్ అదిరింది!

ABP Desam Updated at: 28 Nov 2021 06:14 PM (IST)
Edited By: Murali Krishna

కాంబోడియాలో ఓ మహిళ.. ఆవును పెళ్లి చేసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌ అయింది. ఈ పెళ్లికి ఊరంతా వచ్చింది.

'ఆవు.. మహిళ.. ఓ భర్త..' ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. ట్విస్ట్ అదిరింది!

NEXT PREV

ప్రపంచ దేశాల్లో ఒక్కో చోట ఒక్కో ఆచారం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తమ నమ్మకాలు, విశ్వాసాలను ప్రజలు పాటిస్తారు. మరికొన్న చోట్ల మూఢ నమ్మకాలను కూడా ప్రజలు పాటించడం చూస్తుంటాం. అయితే కాంబోడియాలో ఓ మహిళ ఏకంగా తాను పెంచుకుంటున్న ఆవును పెళ్లి చేసుకుంది. ఇందుకు కారణం ఏంటో మీరే చూడండి.


ఏం జరిగింది?


రైటర్స్ ఇటీవల ఓ షాకింగ్ వీడియోను పోస్ట్ చేసింది. మారిటల్ బ్లిస్ ప్రాంతంలో ఉంటోన్న కాంబోడియాకు చెందిన ఓ మహిళ తన వద్ద ఉన్న ఆవును ఎంతో ప్రేమగా చూస్తోంది. చనిపోయిన తన భర్త ఈ ఆవుగా పునర్జన్మనెత్తాడని ఆ మహిళ చెబుతోంది. అంతేకాదు ఏకంగా ఆ ఆవును పెళ్లి కూడా చేసుకుంది.



కిమ్ హంగ్.. భర్త ఇటీవల చనిపోయాడు. అప్పటి నుంచి తన వద్ద ఉన్న ఆవుకు దగ్గరుండి స్నానం చేసి ఇంటి లోపలికి తీసుకువెళ్లి తన భర్త వినియోగించిన తలగడపైన పడుకోబెడుతోంది. ఇదేంటని ప్రశ్నించిన వారు కిమ్ చెప్పిన సమాధానం విని షాకయ్యారు.



ఈ ఆవు దూడను నా భర్తగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది చేసే ప్రతి పని బతికుండగా నా భర్త కూడా అలానే చేసేవాడు. నాకు దీన్ని చూసినప్పుడు నా భర్తే గుర్తొస్తాడు.                                                   - కిమ్ హంగ్


ఆ మహిళ కుమారుడు కూడా ఆమె చెప్పే విషయాన్నే చెబుతున్నాడు. అందుకే ఈ ఆవును ఎక్కడికి వెళ్లంగా భద్రంగా చూసుకుంటున్నట్లు తెలిపాడు. తన తండ్రి ఆత్మ ఈ ఆవులో ఉందని చెప్పుకొచ్చాడు.


పెళ్లి..


ఈ పెళ్లికి ఊరిలోని 100 మందిని ఆమె ఆహ్వానించింది. అయితే పెళ్లికి వచ్చిన వారు అది సాధారణ ఆవు మాత్రమేనని చెప్పినా ఆ మహిళ వినే పరిస్థితుల్లో లేదని చెబుతున్నారు. తాను బతికుండగానే కాదు తను చనిపోయినా కూడా ఆ ఆవును అమ్మకూడదని కిమ్ తన పిల్లల దగ్గర మాట తీసుకుంది. ఒక వేళ ఆ ఆవు చనిపోతే తమ సొంత తండ్రికి జరిపించినట్లే అంత్యక్రియలు చేయాలని చెప్పింది.


చాలా చోట్ల..


కంబోడియాలో 95 శాతం మంది బుద్ధిజాన్ని అనుసరిస్తారు. ఎవరైనా చనిపోతే ఆ ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశిస్తుందని వారు నమ్ముతారు. అయితే ఇలా జంతువుల శరీరాల్లోకి ప్రవేశిస్తుందని నమ్మడం చాలా అరుదు. 


అయితే జంతువులను పెళ్లి చేసుకోవడం మాత్రం కొత్త విషయమేం కాదు. 2020 జులై 14న ఇండోనేసియాకు చెందిన ఓ యువకుడికి ఆవుతో పెళ్లి చేయాలని ప్రయత్నించారు.


Also Read: Omicron Variant: కొత్త వేరియంట్‌పై కేంద్రం కీలక సూచనలు.. సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖ


Also Read: Covid New Variant: 'దేవుడా.. ఓ మంచి దేవుడా.. దయచేసి కొత్త వేరియంట్‌ను నా రాష్ట్రానికి రానివ్వకు'


Also Read: Mann Ki Baat: నాకు పవర్‌ కాదు.. ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ


Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్


Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'


Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?


Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?


Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 28 Nov 2021 06:11 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.