ఇండియన్ నేవల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో ITI అప్రెంటిస్ ట్రేడ్స్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. 173(పురుష మరియు స్త్రీ) ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఫుల్ టైమ్ ప్రాతిపదికన కర్ణాటకలోని కర్వార్, గోవాలోని దాబోలిమ్‌లలో పోస్టింగ్ ఉంటుంది.
నవంబర్ 20, 2021న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 19, 2021న ముగుస్తుంది. ఇండియన్ నేవల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ రిక్రూట్‌మెంట్ 2021లో అప్రెంటీస్ ట్రేడ్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు.. ఏప్రిల్ 1, 2022 నాటికి 21 ఏళ్లు మించకూడదు. ఎస్టీ, ఎస్టీలకు మరో 5 ఏళ్ల సడలింపు ఉందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఇండియన్ నావల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ ఖాళీల వివరాలు
పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
నావల్ షిప్ రిపేర్ యార్డ్ | 150 |
నావల్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ | 23 |
మొత్తం | 173 |
విద్యార్హతలు..
ఇండియన్ నేవల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ రిక్రూట్‌మెంట్ 2021 ద్వారా ఐటీఐ అప్రెంటీస్ ట్రేడ్ జాబ్స్ 2021 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి పాస్ అయి ఉండాలి. కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత ట్రేడ్‌లో కనీసం 65% మార్కులతో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.
ఎంపిక మరియు పే స్కేల్
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం.. పదో తరగతి మరియు ఐటీఐలో పొందిన మార్కుల ఆధారంగా ఉంటుంది. అంతేగాకుండా పరీక్ష, ఇంటర్వ్యూ చేస్తారు. దరఖాస్తుదారులు ఇండియన్ నావల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ రిక్రూట్‌మెంట్ 2021 ద్వారా అధికారికంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. వారి దరఖాస్తులను డిసెంబర్ 19, 2021లోపు సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ స్టైఫండ్ రూ. 7,700 నుంచి రూ. 8,050 వరకూ ఉంటుంది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత, అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ నేవల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ నోటిఫికేషన్ 2021లో అప్లై చేసిన సంబంధిత పత్రాలతో పాటు దరఖాస్తు యొక్క హార్డ్ కాపీని పంపాలి. 'ఆఫీసర్-ఇన్-ఛార్జ్, డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్, నేవల్ షిప్ రిపేర్ యార్డ్, నేవల్ బేస్, కార్వార్, కర్ణాటక - 581308' పోస్టు చేయాలి. ఇండియన్ నావల్ షిప్ ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్ నోటిఫికేషన్ 2021 PDF
Also Read: Job Loss: ఉద్యోగం కోల్పోయారా? పే కట్‌ను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే