Mann Ki Baat: నాకు పవర్‌ కాదు.. ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ

ABP Desam   |  Murali Krishna   |  28 Nov 2021 01:29 PM (IST)

'మన్‌ కీ బాత్'లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ముఖ్యం కాదని ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని మోదీ అన్నారు.

నాకు పవర్ కాదు ప్రజలే ముఖ్యం: మోదీ

"నేను అధికారంలో ఉండాలని అనుకోలేదు.. ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. నేను ప్రజా సేవకుడ్ని మాత్రమే.. ప్రజలకు సేవ చేయడంలో నాకు తృప్తి ఉంది." ఇవి మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తి అవుతున్న సందర్భంగా చేయనున్న 'అమృత్ మహోత్సవ్' గురించి ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

పంచాయత్ నుంచి పార్లమెంటు వరకు 'అమృత్ మహోత్సవం' ఘనంగా జరపాలి. మన స్వాతంత్య్ర సమరయోధులను తరువాతి తరాలు కూడా గుర్తుంచుకోవాలి. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నాం. డిసెంబర్‌లో నేవీ డే, ఆర్మ్‌డ్ ఫోర్స్ ఫ్లాగ్ డే జరపుకోనున్నాం. డిసెంబరు 16నాటికి 1971 యుద్ధం జరిగి, 50 ఏళ్లు పూర్తవనుంది. ఈ సందర్భంగా నేను సాయుధ దళాలు, మన సైనికులు, వారికి జన్మనిచ్చిన తల్లులను స్మరించుకుంటున్నాను.                                     -   ప్రధాని నరేంద్ర మోదీ

ఆ స్ఫూర్తితో..

ఉత్తర్​ప్రదేశ్​లో జాలౌన్​ జిల్లాలో నూన్ నది ఉంది. ఆ నది క్రమంగా అంతరించిపోయే దశకు చేరుకుంది. దీని వల్ల ఆ ప్రాంతంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఆ రైతులు ఓ సంఘంగా ఏర్పడి ఆ నదిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇది సబ్​కా సాత్​, సబ్​ కా వికాస్​ స్ఫూర్తికి నిదర్శనం -                                                               ప్రధాని నరేంద్ర మోదీ

Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్

Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'

Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?

Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?

Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 28 Nov 2021 01:21 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.